twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి దాకా ఎందుకని ముందే కానిచ్చేసిన హీరోయిన్.. సమాజం ఏమనుకుంటే నాకేంటి అంటూ సెన్సేషన్

    |

    నేటితరం హీరోయిన్లు మహా ఫాస్ట్ అయ్యారు. సినిమాలు, వ్యక్తిగత జీవితం ఏదైనా సరే.. ఫాస్ట్ ఫాస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లు అన్నింటా ముందే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రెగ్నెన్సీకి పెళ్లి అడ్డు కాదని నిరూపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది హీరోయిన్ అమీ జాక్సన్. తాజాగా ఇదే బాటలో మరో హీరోయిన్ చేరడం ఆసక్తికర అంశంగా మారింది.

    బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, హీరోయిన్ కల్కి కొచ్లిన్.. అమీ జాక్సన్ లాగే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. ఇప్పటికే వివాహం చేసుకున్న ఆమె భర్తతో విడాకులు కూడా తీసుకుంది. కానీ ప్రస్తుతం ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. అంతటితో ఆగకుండా ప్రియుడితో వివాహం కాకపోయినా తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఈ ఇష్యూ బీటౌన్ లో హాట్ టాపిక్‌గా మారింది.

    Kalki Koechlin Open Comments On Her pregnancy

    అంతేకాదండోయ్.. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఏదో తప్పు చేసినట్లుగా ఈ సమాజం చూస్తుందంటూ క్లాస్ తీసుకుంది కల్కి. అలాంటి సమాజం కోసం మన పద్దతులు, పనులు మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ వేసి షాకిచ్చింది.

    ప్రస్తుతం తాను తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని నిర్మొహమాటంగా చెప్పేసింది కల్కి. తాను ప్రెగ్నెంట్ అయ్యాయని తెలిసి తన బాయ్‌ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడని ఆమె చెప్పడం విశేషం. అప్పట్లో అఖిల్ తొలి సినిమాకు ముందు టైటాన్ యాడ్‌లో ఆయనతో కలిసి నటించింది కల్కి. ఏదేమైనా ఈ తరం హీరోయిన్ల దూకుడే వేరండీ బాబు!.

    English summary
    Bollywood actress Kalki Koechlin open up on her pregnancy. She is responding her pregnancy issue shockingly. she is into her fifth month of pregnancy and wants to deliver her baby through the water birth process.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X