పెళ్ళికి ముందే తల్లి కాబోతున్న హీరోయిన్.. 'గే' పుట్టినా ఫర్వాలేదంటూ సెన్సేషనల్ కామెంట్స్

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎంత ఓపెన్‌గా ఉంటున్నారో అంతే ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు. సహజీవనం, పెళ్ళికి ముందు గర్భం లాంటి వాటినైతే లైట్ తీసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్‌కైతే ఇవి మరీ లైట్. అయితే తాజాగా ఇలాంటి విషయంలోనే మరో అడుగు ముందుకేసి తనకు పుట్టబోయే బిడ్డ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్. వివరాల్లోకి పోతే..

పెళ్లి కాకుండానే గర్భం.. పైగా

పెళ్లి కాకుండానే గర్భం.. పైగా

తనకు పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ కావాలని కోరుకోవడం చూశాం. ఆ బిడ్డ అందంగా ఉండాలని అనుకోవడం సాధారణంగా అందరిలో కనిపించే అంశం. కానీ అందరికీ బిన్నంగా తనకు పుట్టబోయే బిడ్డ 'గే' అయినా ఏం ఫర్వాలేదు అనేసి షాకిచ్చింది బాలీవుడ్ భామ కల్కి కొచ్లిన్. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఈమె చేసిన ఈ కామెంట్స్ జనాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఎంజాయ్ చేస్తున్నా.. డోంట్ కేర్

ఎంజాయ్ చేస్తున్నా.. డోంట్ కేర్

తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన కల్కి.. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నానని తెలిపింది. అంతటితో ఆగక తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ లేదా థర్డ్ జెండర్ (గే) అయినా డోంట్ కేర్ అని అనేసి ఒక్కసారిగా షాకిచ్చింది. ప్రస్తుతం తాను మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది కల్కి.

అతనితో డేటింగ్.. పెళ్లికాకుండానే గర్భవతి

అతనితో డేటింగ్.. పెళ్లికాకుండానే గర్భవతి

బాలీవుడ్ భామ కల్కి కొచ్లిన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ లోని జెరూసలెంకు చెందిన పియానిస్ట్ గయ్ తో ప్రేమలో మునిగి తేలుతోంది. ఆయనతో సహజీవనం చేసిన కల్కి.. గర్భవతి అయింది. పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతోంది. గతంలో బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్‌ను పెళ్లి చేసుకున్న కల్కి కొచ్లిన్.. 2015 సంవత్సరంలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ధైర్యంగా చెప్పేస్తూ..

ధైర్యంగా చెప్పేస్తూ..

తాను ప్రస్తుతం ఐదు నెలల గర్భవతిని అని, ఎప్పుడు బిడ్డను కనాలి.. ఆ బిడ్డతో ఎప్పుడు, ఎలా కనెక్ట్‌ కావాలో తనకు బాగా తెలుసని పేర్కొంది కల్కి. గర్భవతి కావడం పట్ల స్పెషల్ రూల్స్ ఏవీ పెట్టుకోలేదని చెప్పిన ఆమె.. గోవాలో పురుడు పోసుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది. దేవ్‌ డీ, రిబ్బన్‌, గల్లీబాయ్‌ సినిమాల్లో నటించి మెప్పించింది కల్కి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X