పెళ్లి కాకుండా తల్లి.. దాచాలాని హీరోయిన్ ప్రయత్నం.. నెటిజన్ల విమర్శలు
పెళ్లి కాకుండా తల్లి అయ్యే సంప్రదాయం భారతదేశం ఇంకా అలవర్చుకోలేదు. ఈ సంస్కృతి పాశ్చత్య దేశాల్లో విరివిగా కనిపిస్తుంది. అయితే సెలెబ్రిటీలో మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హాలీవుడ్ నటీనటుల్లో ఈ పద్దతి సర్వసాధారణం. అలాంటి విధానమే బాలీవుడ్‌లోనూ పాకిందా? అనే అనుమానం వస్తోంది. తాజాగా ఓ హీరోయన్ పెళ్లి కాకుండానే తల్లి అయిందని, ఆ విషయాన్ని దాచేందుకు కూడా బాగానే ప్రయత్నించిందని తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

ప్రియుడితో సహజీవనం..
పెళ్లి కాకుండానే తల్లి కాబోతోన్నట్టు బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ ప్రకటించింది. ఈమె తన ప్రియుడితో సహజీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని కారణంగానే ఆమె తల్లి కాబోతుంది. కరీనా కపూర్ నిర్వహించే ఓ షోలో పాల్గొంటూ ఈ విషయాలన్నింటిపై స్పందించింది.

వయసు తేడా ఉండటంతో..
కల్కి తన 25 సంవత్సరాల వయసులో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ను వివాహం చేసుకున్నానని తెలిపింది. 2011లో వివాహం కాగా రెండు సంవత్సరాల్లోనే విడిపోయామని పేర్కొంది. 2015లో అధికారికంగా విడాకులు తీసుకున్నామని చెప్పుకొచ్చింది. తమ మద్య వయసు ఎక్కువ తేడా ఉండటంతో పాటు చిన్న వయసులో నేను వివాహం చేసుకోవడం వంటి కారణాల వల్ల తాము విడాకులు తీసుకున్నాము పేర్కొంది.

అనంతరం హర్ష్ బర్గ్‌తో డేటింగ్..
అనురాగ్‌తో విడిపోయిన తర్వాత కూడా ఆయనతో స్నేహంగా ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె హర్ష్ బెర్గ్ తో ప్రేమలో ఉన్నట్లుగా తెలిపింది. ఇద్దరం కూడా లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నామని వెల్లడించింది. తాను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పకూడదనుకున్నానని తెలిపింది.

పెళ్లి కాకుండా తల్లి కావడమేంటి?
కానీ మేకప్ మెన్‌కు మాత్రం తెలియకుండా ఆగలేదని చెప్పుకొచ్చింది. నాలుగవ నెల సమయంలో తాను ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి తెలిసి పోయిందని తెలిపింది. తనలో వచ్చిన మార్పులను బట్టి అందరు కూడా గుర్తించారని అంది. ఎప్పటికైనా తెలియాల్సిందే.. కాస్త ముందుగానే తెలిసిందని పేర్కొంది. తాను తల్లి కాబోతున్నందుకు కొందరు సంతోషంగా ఉంటే మరికొందరు మాత్రం పెళ్లి కాకుండానే తల్లి ఏంటీ అంటూ విమర్శలు చేస్తున్నారని వాపోయింది. మొత్తానికి తాను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











