twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయిలు కన్యత్వంతో ఎందుకుండాలి.. గిఫ్ట్ ఇవ్వడానికి అది నిధా.. బాలీవుడ్ నటి కామెంట్స్!

    |

    ప్రస్తుతం బాలీవుడ్ లో మీటూ గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. అదే సమయంలో చాలా మంది సెలెబ్రిటీలు లైంగిక స్వేచ్ఛ గురించి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా కల్కి కొచ్లిన్ ఇండియాలోని లైంగిక అసమానతల గురించి మాట్లాడింది. కల్కి కొచ్లిన్ మహిళల కన్యత్వం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్కి కొచ్లిన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం రేగుతోంది.

    ఇండియాలో లైంగిక అసమానతలు

    ఇండియాలో లైంగిక అసమానతలు

    ఇండియాలో లైంగిక సమానత్వం లేదు. మహిళలు తమ అభిప్రాయాలని చెప్పినా, ఏదైనా విషయంలో తప్పులు ఎత్తి చూపినా మహా పాపంలా భావిచే వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలి అని కల్కి కోచలిం తెలిపింది. మహిళలు స్వతంత్రంగా అలోచించి నచ్చక పోతే నో అని ధైర్యంగా చెప్పే రోజులు రావాలి. అంతవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అని కల్కి కొచ్లిన్ తెలిపింది.

    మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

    అలాంటి అపోహలు తొలగాలి

    అలాంటి అపోహలు తొలగాలి

    ఇండియాలో శృంగారం పవిత్రంగా ఉండాలి.. ఆలా చేయడం తప్పు అనే అపోహ జనాల్లో ఉంది. దానిని తొలగించాలి. శృంగారం విషయంలో అందరిని చైతన్య వంతులు చేయాలి అని కొచ్లిన్ తెలిపింది. మహిళలు శృంగారం గురించి మాట్లాడడమే పాపం అని భావించే పరిస్థితులు ఇంకా ఉన్నాయి. మహిళలు ఏదైనా విషయంలో నచ్చితే అవునని, లేకుంటే కాదని చెప్పే పరిస్థితులు కల్పించాలని కొచ్లిన్ అభిప్రాయ పడింది.

    కన్యత్వం ఏమైనా నిధా

    కన్యత్వం ఏమైనా నిధా

    అమ్మాయిల కన్యత్వం గురించి కల్కి కొచ్లిన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. శృంగారం పవిత్రంగా ఉండాలనే మాటలు ఇకనైనా ఆపాలి. కన్యత్వం ఏమైనా నిధా.. దానిని భద్రంగా దాచిపెట్టి భర్తకు గిఫ్ట్ గా ఇవ్వడానికి అని కల్కి కొచ్లిన్ అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దూరం రేపుతున్నాయి. కల్కి కొచ్లిన్ పై విమర్శలు చెలరేగుతున్నాయి.

    తల్లిదండ్రులే చెప్పాలి

    తల్లిదండ్రులే చెప్పాలి

    తల్లి దండ్రులు ఎవరూ శృంగారం గురించి పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఆ ధోరణి మారాలి. శృంగారం, లైంగిక వేధింపుల గురించి అర్థమయ్యేలా తేడా చెప్పాలి. శృంగారం గురించి మాట్లాడకుండా లైంగిక వేధింపుల గురించి మాట్లాడాడలేం అని కల్కి కొచ్లిన్ తెలిపింది.

    English summary
    Kalki Koechlin: Virginity isn’t Some Treasure for a Girl to Protect and Give as Gift to Husband Kalki Koechlin says we have to stop making sex holy or dirty.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X