మళ్లీ ట్విట్టర్లోకి వచ్చాడు.... ఇప్పటి నుండి ఇంకెంత రచ్చ చేస్తాడో?
ట్విట్టర్లో వివాదాలు క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మను మించినోడు ఒకడున్నాడు... అతడే బాలీవుడ్ నటుడు, నిర్మాత, ఫిల్మ్ క్రిటిక్ కమాల్ రషీద ఖాన్ (కెఆర్‌కె). ట్విట్టర్ ఉపయోగించి ఎన్ని గొడవలు చేయవచ్చో అన్నీ చేశాడు. ఇతడి ఆగడాలు భరించలేక గతేడాది ట్విట్టర్ యాజమాన్యం అకౌంట్ సస్పెండ్ చేసింది. దాదాపు సంవత్సరం తర్వాత మళ్లీ ఈ అకౌంట్ యాక్టివేట్ అయింది.
అప్పట్లో తన ట్విట్టర్ అకౌంట్ రీ యాక్టివేట్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ట్విట్టర్ యాజమాన్యాన్ని సైతం బెదిరించిన ఘనత కూడా కెఆర్‌కె సొంతం చేసుకున్నాడు. కెఆర్‌కె ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ లాంటి వారి వెల్ కం చెబుతూ ట్వీట్ చేశారు.

గతేడాది కమాల్ రషీద్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేయడానికి కారణం... అమీర్ ఖాన్ మూవీ 'సీక్రెట్ సూపర్ స్టార్' క్లైమాక్స్ లీక్ చేయడమే. దీంతో పాటు అమీర్ ఖాన్ మీద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అమీర్ ఖాన్ పట్టుబట్టి మీరీ ఇతడి అకౌంట్ సస్పెండ్ చేయించారని అప్పట్లో చర్చించుకున్నారు. గతంలో కెఆర్‌కె... పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ రిలీజ్ సందర్భంగా దారుణమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
అకౌంట్ సస్పెండ్ కావడానికి ముందు అతడికి దాదాపు 5 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవారు. అయితే ఇపుడు అది కాస్త 3.86 మిలియన్‌కు డౌన్ అయింది. త్వరలో అమీర్ ఖాన్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' మూవీ విడుదల ఉండటంతో ఈ సినిమాను, అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ అతడు ప్రతీకారం తీర్చుకుంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా... మంచి పనులు చేయడానికి బ్యాడ్ బాయ్ తిరిగి వచ్చాడు. కెఆర్‌కు వెల్ కం... నిన్ను చాలా మిస్సయ్యాం అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











