twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిషి, ఇర్ఫాన్‌పై అసభ్య ట్వీట్లు.. నటుడు కమల్ ఆర్ ఖాన్‌పై కేసు... అరెస్ట్ దిశగా

    |

    బాలీవుడ్‌లో వివాదాస్పద ప్రముఖుడు, నటుడు కమల్ ఆర్ ఖాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. దివంగత నటులు రిషికపూర్, ఇర్ఫాన్ ఖాన్‌ మరణాంతరం వారిని కించపరిచే విధంగా ట్వీట్లు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యల చేసినందున కమల్‌పై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో కమల్ ఖాన్ చేసిన ట్వీట్లు ఏమిటంటే..

    నోరు పారేసుకొన్న కమల్ ఆర్ ఖాన్

    నోరు పారేసుకొన్న కమల్ ఆర్ ఖాన్

    ఏప్రిల్ 29వ తేదీన మరణించిన ఇర్ఫాన్ ఖాన్‌పై ట్వీట్ల రూపంలో కమల్ ఆర్ ఖాన్ నోరు పారేసుకొన్నారు. ఇర్ఫాన్ ఖాన్ నిర్మాతలను వేధించేవాడు. పలు నిర్మాతల వద్ద నుంచి డబ్బు తీసుకొని సినిమాలు పూర్తి చేయలేదు. అతను నిర్మాతలతో ప్రవర్తించిన తీరు చాలా దారుణం. అలా ఆయన కారణంగా చాలా సినిమాలు పూర్తికాకుండా ఉన్నాయి అని కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశారు.

     వైన్ షాపులు తెరుసున్నారు.. రిషి చావొద్దు

    వైన్ షాపులు తెరుసున్నారు.. రిషి చావొద్దు

    ఇక ఏప్రిల్ 30 తేదీన రిషికపూర్ మరణాంతరం కమల్ ఖాన్ వివాదాస్పద ట్వీట్ చేశారు. రిషికపూర్ మరణించకూడదని కోరుకొంటున్నాను. ఎందుకంటే మహారాష్ట్రలో త్వరలోనే వైన్ షాపులు ఓపెన్ చేయనున్నారు అంటూ వ్యంగ్యంగా కమల్ ఆర్ ఖాన్ ట్వీట్లు చేయడంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. సమయం, సందర్భం లేకుండా ఇలాంటి ట్వీట్లు చేస్తారా అంటూ నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

    యువసేన సంస్థ సీరియస్

    యువసేన సంస్థ సీరియస్

    ఇలా వరుస ట్వీట్లతో కమల్ ఖాన్ సోషల్ మీడియాలో విరుచుకుపడటంపై మహారాష్ట్రలోని యువసేనకు సంబంధించిన కమిటీ సభ్యుడు రాహుల్ కనల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేఆర్కే ట్వీట్లను తప్పుపడుతూ ఆయనపై బంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ట్వీట్లు దారుణంగా ఉన్నాయి. అందుకే ఆయనపై కేసు నమోదు చేశాను అని చెప్పారు.

    కేఆర్కేపై కేసు.. అరెస్ట్..

    కేఆర్కేపై కేసు.. అరెస్ట్..

    యువసేన కమిటీ సభ్యుడి ఫిర్యాదు మేరకు నటుడు కమల్ ఆర్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. పబ్లిక్‌గా అసభ్య పదజాలాన్ని వాడటం కింద ఆయనపై ఐపీసీ సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశాం. ఈ వ్యవహారానికి సంబంధించిన మరికొన్ని సెక్షన్లను కూడా విధించాం అని ముంబై పోలీసు అధికారి వెల్లడించారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయలేదన్నారు.

    Recommended Video

    R Narayana Murthy About LB Sriram Greatness
     అగ్రనటుల మృతితో విషాదంలో బాలీవుడ్

    అగ్రనటుల మృతితో విషాదంలో బాలీవుడ్

    బాలీవుడ్‌లో అగ్ర నటులైన రిషి కపూర్, ఇర్ఫాన్ కపూర్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ మృతి చెందారు. ముంబైలో లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్, 30 తేదీన రిషికపూర్ కన్నుమూశారు. ఇద్దరి నటుల మృతి హిందీ చిత్ర సీమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. అభిమానులు షాక్‌‌కు గురై విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

    English summary
    Bollywood Actor Kamaal R Khan in legal trouble. Yuva Sena organisation filed case KRK over derogatory remarks Rishi Kapoor and Irrfan after their death. Bandra Police filed FIR and investigating the case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X