twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరణ్ జోహర్ దివాళా.. ఆత్మహత్యాయత్నం.. బాలీవుడ్ ప్రముఖుడి సంచలన ఆరోపణలు

    |

    ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కోంటోంది. సినిమాలో కంటెంట్ ఎలా ఉన్న ఏదో ఒక విధంగా విమర్శల పాలవుతోంది. బాయ్ కాట్, నెపోటిజం అంటూ అనేక కారణాలతో హిందీ సినిమాలను ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడమే కాకుండా పెట్టిన బడ్జెట్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) నిత్యం వివాదస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసి కాంట్రవర్సీకి తెరలేపాడు. ఈసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కేఆర్కే.

    హిందీతోపాటు ఇతర భాషల్లో..

    హిందీతోపాటు ఇతర భాషల్లో..

    బాలీవుడ్ యంగ్ హీరో రణ్​బీర్​ కపూర్​, బ్యూటిఫుల్ హీరోయిన్ అలియా భట్​తోపాటు అమితాబ్ బచ్చన్​, షారుక్ ఖాన్, టాలీవుడ్​ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్​ కీలక పాత్రలు పోషించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఫాక్స్ స్టార్ స్టూడియోస్​, కరణ్ జోహర్​ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ సినిమాకు ప్రీతం సంగీతం అందించగా, హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్​గా సెప్టెంబర్​ 9న విడుదల అయింది.

    రూ. 400 కోట్ల బడ్జెట్ తో..

    రూ. 400 కోట్ల బడ్జెట్ తో..

    భారతదేశ చరిత్రలో భారీ బడ్జెట్​, అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కించిన సినిమా బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పించారు. అనేక అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే సుమారు రూ. 400 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ. 400 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలిపారు.

    కరణ్ జోహార్ ఆత్మహత్యాయత్నం..

    కరణ్ జోహార్ ఆత్మహత్యాయత్నం..


    అయితే బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ కలెక్షన్స్ అంతా రాబట్టలేదని మరో వెర్షన్ వినిపిస్తున్నాడు సినీ క్రిటిక్ గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్. ఈ విషయం గురించే మాట్లాడుతూ ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు కమల్ ఆర్ ఖాన్. అంతేకాకుండా బ్రహ్మాస్త్ర భారీ నష్టంతో నిర్మాత కరణ్ జోహార్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని తాజాగా చేసిన ఓ ట్వీట్ లో తెలిపాడు.

    రూ. 300 కోట్లు ఇచ్చిన ముఖేష్ అంబానీ..

    కమల్ ఆర్ ఖాన్ తన ట్వీట్ లో "నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల కిందట కరణ్ జోహార్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటానని పెద్ద డ్రామా చేశాడు. ఎందుకంటే బ్రహ్మాస్త్ర సినిమా తెచ్చిన నష్టాల వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తర్వాత అతనికి ముఖేష్ అంబానీ రూ. 300 కోట్ల లోన్ ఇచ్చి ఆదుకున్నాడు. అయితే ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే.. బ్రహ్మాస్త్ర అనే డిజాస్టర్ మూవీ వల్ల తాను దివాళా తీసినట్లు కరణ్ ప్రపంచానికి ఎందుకు క్లియర్ గా చెప్పట్లేదు" అని రాసుకొచ్చాడు.

    ఏలియన్స్ రాబోతున్నాయంటూ..

    ఏలియన్స్ రాబోతున్నాయంటూ..


    ప్రస్తుతం కరణ్ జోహార్ కామెంట్స్ బాలీవుడ్ లోనే కాకుండా వివిధ చిత్ర పరిశ్రమల్లో సెన్సేషనల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే బ్రహ్మాస్త్ర రిలీజ్ సమయంలో కూడా ఆ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలను బయట పెట్టాడు కమల్ ఆర్ ఖాన్. ఈ సినిమా కోసం బృహస్పతి, అంగారక గ్రహాల నుంచి ఏలియన్స్ భూమిపైకి రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈసారి కరణ్ జోహార్ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడని మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కేఆర్కే.

    English summary
    Bollywood Film Critic Kamaal R Khan Sensational Comments On Producer Karan Johar. He Is Tried To Commit Suicide Because Of Brahmastra Movie Loss.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X