సినిమాను దెబ్బ తీసే కుట్ర.. అనవసరంగా రాద్ధాంతం.. క్రిష్‌పై మణికర్ణిక నిర్మాత ఎటాక్

మణికర్ణిక సినిమాకు సంబంధించిన డైరెక్టర్ టైటిల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. క్రిష్ జాగర్లమూడి, కంగన రనౌత్, రంగోలి ఇటీవల ఒకరిపై మరొకరు వాగ్భాణాలు సంధించుకొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాత కమల్ జైన్ తీవ్రంగా స్పందించాడు. కంగన రనౌత్‌కు అండగా నిలిచి క్రిష్‌పై తీవ్ర పదజాలంతో ఎటాక్ చేశారు. సినిమా వసూళ్లపై ప్రభావం పడే విధంగా క్రిష్ కామెంట్లు చేస్తున్నాడని ఆరోపించాడు. ఇంకా కమల్ జైన్ ఏమన్నారంటే..

అనవసరంగా రాద్దాంతం

అనవసరంగా రాద్దాంతం

మణికర్ణిక సినిమా దర్శకత్వ బాధ్యతల అంశంపై క్రిష్ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు. సినిమా భారీ విజయం సాధించడం, ఆ తర్వాత రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్న నేపథ్యంలో దర్శకుడిని నేనే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని కమల్ జైన్ అన్నారు.

మార్పులు చేయమని నేనే చెప్పా

మార్పులు చేయమని నేనే చెప్పా

రిష్ సినిమా నుంచి తప్పుకొన్న తర్వాత కంగనకు అవసరమైన మార్పులు చేయమని నేనే సలహా ఇచ్చాను. పక్కా కమర్షియల్ బాలీవుడ్ సినిమాలా ఉండేందుకు కంగనకు కొన్ని సూచనలు చేశాను. సినిమాలో మార్పులు, చేర్పుల విషయం చిత్ర యూనిట్ సమిష్టి నిర్ణయం. కంగన సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అని కమల్ జైన్ పేర్కొన్నారు.

క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడు

క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడు

తనకు అర్హత లేకున్నా సినిమా దర్శకత్వం టైటిల్ విషయంలో అనవసరంగా క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నించడం చాలా దారుణం. ఆయనకు క్రెడిట్ ఇవ్వాలా వద్దా అనేది మా సొంత నిర్ణయం. సినిమా కోసం చివర వరకు నిలబడిన కంగనపై మాటల దాడి చేయడం చాలా అన్యాయం అని కమల్ జైన్ అన్నట్టు ఆంగ్ల వెబ్‌సైట్ కథనాన్ని పేర్కొన్నది.

కంగనపై లేనిపోని ఆరోపణలు

కంగనపై లేనిపోని ఆరోపణలు

కంగన రనౌత్‌పై లేనిపోని ఆరోపణల చేయడం క్రిష్ తగదు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తుండటం చూసి సినిమా వసూళ్లను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ తన వాదనలో ఏదైనా పస ఉంటే చట్టపరంగా మాపై చర్యలు తీసుకోవచ్చు అని కమల్ జైన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X