కామసూత్ర 3డీ హీరోయిన్ ఆకస్మిక మరణం.. షాక్ గురి చేసిన విషాద ఘటన
కామసూత్ర చిత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి సైరా ఖాన్ ఆకస్మిక మరణం పొందారు. 2013లో విడుదలైన కామసూత్ర 3డీ చిత్రంతో బాలీవుడ్‌కు సైరా పరిచయం అయ్యారు. తొలుత ఈ చిత్రంలో షెర్లీన్ చోప్రాను ఎంపిక చేశారు. అయితే ఆమె స్థానంలో సైరా వెలుగులోకి రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రానికి రుపేష్ పాల్ దర్శకత్వం వహించారు. సైరా మరణాన్ని రూపేష్ మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఆమె ఎలా చనిపోయారంటే..

గుండెపోటుతో సైరా ఖాన్ మృతి
బాలీవుడ్ తెరకు కొద్దికాలంగా దూరమైన సైరా ఖాన్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఆమె మరణించగా ఈ వార్త ఆలస్యంగా మీడియాకు తెలిసింది. సైరా మరణంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా తమ సంతాప సందేశాలను వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు.

నన్ను షాక్ గురి చేసిందని
సైరా ఖాన్ కామసూత్ర డైరెక్టర్ రూపేష్ పాల్ స్పందిస్తూ.. ఆ మరణ వార్త నన్ను షాక్ గురిచేసింది. తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను. నటిగా ఆమెకు రావాల్సిన గౌరవం దక్కలేదనే ఆవేదన నాకు ఉంది. సైరా నటన గురించి మీడియాలో ఎక్కడా ప్రస్తావించకపోవడం నాకు మరింత షాక్ కలిగించింది. అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆమెకు ఎందుకు గుర్తింపు రాలేదనే విషయం ఇప్పటికీ అంతుపట్టదు అని రూపేష్ అన్నారు.

పాత్రకు ఒప్పించడానికి కష్టపడ్డా
కామసూత్ర 3డీ చిత్రంలోని ఆమె పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. కామసూత్రంలో ఆ పాత్రకు ఒప్పించడానికి చాలా కష్టపడ్డాం. కానీ ఒకసారి ఆమె ఒప్పుకొన్న తర్వాత ఆ పాత్రలో ఒదిగిపోయారు అని రూపేష్ పేర్కొన్నారు. 2013లో కేనస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ చిత్రం ప్రదర్శించగా.. ఆమె నటనకు విదేశీ మీడియా ఫిదా అయ్యింది.

సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి
సైరాఖాన్ అత్యంత సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన వారు. అలాంటి నేపథ్యంతో వచ్చి కామసూత్రలో నటించడం అందర్ని షాక్ గురిచేసింది. ఆ చిత్రంలో బోల్డ్‌గా ఆమె నటించిన తీరు ఆకట్టుకొన్నది. షెర్లీన్ చోప్రా వివాదం కారణంగానే ఆమె దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.


Click it and Unblock the Notifications











