కామసూత్ర నటుడు కన్నుమూత.. అంత్యక్రియలకు దూరంగా ఉండండి..

కామసూత్ర నటుడు రంజిత్ చౌదరీ ఇకలేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపుడుతున్న ఆయన బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. ప్రముఖ నటి పర్ల్ పదాంసీ కుమారుడు అనే విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో సేవలందిస్తున్న ఆయన మరణించడంపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

రంజిత్ చౌదరీ మృతి గురించి ఆయన సోదరి రెడల్ పదాంసీ ధృవీకరించారు. రంజిత్ ఇకలేరనే విషయం చాలా విషాదకరంగా మారింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎవరూ కూడా అంత్యక్రియలకు హాజరుకావొద్దు. వ్యక్తిగతంగా కూడా ఎవరి రావొద్దు. తమ ఇంట్లోనే ఉంటూ రంజిత్‌కు శ్రద్దాంజలి ఘటించండి అంటూ సోదరి రెల్ కోరారు. మే 5వ తేదీన ఆయన సంస్మరణ సభ ఉంటుందన్నారు.

Kamasutra actor Ranjit Chowdhry no more

ఖూబ్‌సూరత్ చిత్రంలో ప్రముఖ దర్శక, నిర్మాత రాకేష్ రోషన్‌కు రంజిత్ సోదరుడిగా నటించి మెప్పించారు. ఆ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. బాతోంకి బాతోం మే, కట్టా మీటా చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి అమెరికన్ టీవీ సిరీస్ ప్రిజన్ బ్రేక్‌లో కీలక పాత్రను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X