సుశాంత్‌ది పక్క ప్లాన్డ్ మర్డర్.. సంజయ్‌దత్ వ్యసనాలు కనిపించవా? బాలీవుడ్‌పై కంగన ఫైర్
బాలీవుడ్‌లో వారసత్వంగా వచ్చే హీరోలు, హీరోయిన్లకే ప్రోత్సాహం ఉంటుంది. బంధుప్రీతి, ఫేవరిటిజం అంశాలే స్టార్ హోదాలను నిర్ణయిస్తాయని గతంలో కరణ్ జోహార్‌పై మండిపడిన ఫైర్ బ్రాండ్ యాక్టర్ కంగన రనౌత్ మరోసారి భగ్గుమన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ నేపథ్యంలో హిందీ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కంగన దుమ్ముదులిపింది. తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వీడియోను రిలీజ్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీపై కారాలు మిరియాలు నూరింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు.. ప్లాన్డ్ మర్డర్ అంటూ వీడియో దుమ్మెత్తి పోసింది. కంగన ఇంకా ఏమన్నారంటే..

మానసికంగా బలహీనుడనే ముద్ర
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఓ వర్గం తల్లడిల్లిపోతుంటే.. బాలీవుడ్‌లో మరో వర్గం అతడి మానసిక స్థితిని తక్కువగా చూపించేందుకు సమాంతరంగా ప్రయత్నాలు చేస్తున్నది. అతడు మానసికంగా బలహీనుడనే ముద్ర వేసే విధంగా మాట్లాడుతున్నారు. మానసికంగా బలహీనుడు కావడం వల్లే డిప్రెషన్‌కు గురై ప్రాణాలు తీసుకొన్నాడనే వెర్షన్ వినిపించడం సరికాదు అని కంగన అన్నారు.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో స్కాలర్ షిప్ కొట్టిన వ్యక్తి
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ కొట్టిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మానసికంగా బలహీనుడని ఎలా అంటారు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌లో ర్యాంక్ సాధించిన వ్యక్తి. అతడి మానసిక స్థితి ఎలా బలహీనం అని డిసైడ్ చేస్తారు. సుశాంత్‌పై ఓ వర్గం చేస్తున్న ప్రచారం సరికాదు అని కంగన రనౌత్ మండిపడింది.

నాకు గాఢ్ ఫాదర్ లేడంటూ ప్రాధేయపడ్డారు..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టులు చూస్తే అతడు ఏమిటో అర్దం అవుతుంది. అతడు తన పోస్టులలో నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. నా సినిమాలు నడవకపోతే నన్ను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారు. దయచేసి నా సినిమాలు చూడండి అంటూ ప్రేక్షకులను ప్రాధేయపడ్డారు. పలు ఇంటర్వ్యూలలో నన్ను ఈ పరిశ్రమ ఎందుకు అక్కున చేర్చుకోవడం లేదంటూ ప్రశ్నించిన విషయాన్ని కంగన తన వీడియోలో వెల్లడించారు.

చెత్త సినిమా గల్లీబాయ్‌కి అవార్డులా?
తన మొదటి సినిమా కాయ్ పో చే నుంచి ఎంఎస్ ధోని లేదా కేదారినాథ్ లేదా చిచ్చేరే వరకు అద్భుతమైన నటన ప్రదర్శించినప్పటికీ ఎందుకు ప్రశంసలు లభించలేదు. చిచ్చోరేకు మంచి ప్రశంసలు లభించినా.. గల్లీబాయ్ లాంటి చెత్త సినిమాలకు అవార్డులు ఎలా ఇస్తారు. చిచ్చోరేకు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ అవార్డులు ఎందుకు ఇవ్వలేదు అంటూ కంగన రనౌత్ మండిపడ్డారు.
Recommended Video

సంజయ్ దత్ అడిక్షన్స్ అందంగా కనిపిస్తాయా?
సుశాంత్ గురించి గుడ్డిగా రాస్తున్న జర్నలిస్టులపై కూడా కంగన రనౌత్ మండిపడ్డారు. సైక్రియాటిక్ అని, న్యూరోటిక్ అని, అఢిక్ట్ అని రాస్తారు. మీకు సంజయ్ దత్ లాంటి వ్యసన పరులు మీకు కనిపించరా? వాళ్ల వ్యసనాల మీకు అందంగా కనిపిస్తాయా?. నీ పరిస్థితి బాగాలేదు. నీవు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దు అని చెబుతూ ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఎందుకు మాట్లాడుతారు. సుశాంత్‌ది సూసైడ్ కాదు.. మీరు పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అంటూ కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











