For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ నాలుగు రాబందులను ముంబై పోలీసులు వద్దలొద్దు.. వాళ్లను ఉరి తీయాలని.. కంగన ఫైర్

  |

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ హిందీ చిత్ర పరిశ్రమలోని బంధుప్రీతి, వేధింపులపై గట్టిగా గళం వినిపిస్తున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు, ట్వీట్లతో హల్ చల్ సృష్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖులపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో రిపబ్లిక్‌ టీవీ అధినేత అర్నబ్ గోస్వామితో మరిన్ని విషయాలు పంచుకొన్నారు. ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ..

  Sushant Singh Rajput : సుశాంత్‌ ను ఎలా చంపారంటే.. కరణ్ జోహర్ పాత్ర హైలైట్ అంటున్న కంగనా!
  పీక్కుతినే రాబందులు..

  పీక్కుతినే రాబందులు..

  బాలీవుడ్‌లో ప్రతిభావంతులైన నటులను పీక్కుతినే రాబందులు ఉన్నాయి. ధోని, చిచ్చోరే లాంటి హిట్ సినిమాలను అందించిన సుశాంత్‌ను ఫ్లాప్ హీరో అంటూ కామెంట్ చేసిన కరణ్ జోహర్, రేపిస్ట్ అంటూ కామెంట్ చేసిన సీనియర్ జర్నలిస్టు రాజీవ్ మసంద్, డ్రగ్గిస్ట్ అంటూ కించపరిచిన మహేష్‌భట్‌ను ముంబై పోలీసులు ఎందుకు ప్రశ్నించారు. సూశాంత్ సూసైడ్‌లో భన్సాలీ, కరణ్ జోహర్‌, రాజీవ్ మసంద్, మహేష్ భట్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ కంగన విరుచుకుపడ్డారు.

  భాయ్ మాటను వ్యతిరేకించవద్దని

  భాయ్ మాటను వ్యతిరేకించవద్దని

  బాలీవుడ్‌లో చాలా మంది మాఫియా చెప్పినట్టు నడుచుకొంటారు. భాయ్‌ మాటను వ్యతిరేకించవద్దు. భాయ్‌ సినిమాను రిజెక్ట్ చేయవద్దని బెదిరిస్తుంటారు. సుల్తాన్ సినిమాను రిజెక్ట్ చేస్తే ఆదిత్య చోప్రా నన్ను బెదిరించారు. నీ సినీ కెరీర్ ముగిసినట్టే అని బెదిరించారు. ఇలా బెదిరించడానికి వారికి ఏం హక్కు ఉంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో బాలీవుడ్ నుంచి కంగనను తరిమివేయాలని కరణ్ జోహర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారు. ఆ సమయంలో నాకు అండగా నిలిచింది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాత్రమే. ఇలాంటి విషయాలే సుశాంత్‌తో కూడా జరిగాయి అని కంగన రనౌత్ చెప్పారు.

  సూసైడ్ మాఫియా అరాచకాలు

  సూసైడ్ మాఫియా అరాచకాలు

  బాలీవుడ్‌లో సూసైడ్ మాఫియాగా మారిన ఆ వ్యక్తులను ఉరితీయాలని అని నేను అనను. కానీ వారి మాఫియా చర్యలను ఎదిరించాలి. వారి అరాచకాలను పోలీసులు ప్రశ్నించాలి. చిన్న చిన్న చర్యలు తీసుకొని వారిని సరైన ట్రాక్‌లో పెట్టాలి. సుశాంత్ సింగ్‌ను ఉద్దేశించి రేపిస్ట్, డ్రగ్గిస్ట్, డైరెక్టర్లను కొడుతాడు అంటూ ఆయన పేరు పెట్టకుండా ఆయనపై పరోక్ష కథనాలను రాజీవ్ మసంద్ అనే డైరెక్టర్ ఎలా రాస్తారు అని కంగన ప్రశ్నించారు.

  పోలీసులు ఆ నలుగురిని విచారించాలి

  పోలీసులు ఆ నలుగురిని విచారించాలి

  భట్, జోహర్, చోప్రా ఫ్యామిలీలు బాలీవుడ్‌లో బలమైనవి. వాళ్లను తప్పకుండా పోలీసులు విచారించాలి. గతంలో నన్ను.. నిన్న సుశాంత్‌ను వేధించినట్టే భవిష్యత్‌లో మరొకరిని వేధిస్తారు. బయటకు రాని వాళ్ల పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా తండ్రులు ఉన్నతంగా వ్యవహరించారు. ఇలా చీప్‌గా ఎదుటివారిని తొక్కాలని చూడలేదు అని కంగన అన్నారు.

   యష్ చోప్రా మాదిరిగా ఉన్నత విలువలు

  యష్ చోప్రా మాదిరిగా ఉన్నత విలువలు

  బాలీవుడ్‌లో యష్ చోప్రా ఎలా ఉన్నతంగా, విలువలకు అనుగుణంగా నడచుకొన్నారో అనే విషయాన్ని చెబుతాను. షారుక్ ఖాన్‌ను యష్ చోప్రా ప్రమోట్ చేశారు. తన సినిమాలోనే కాకుండా ఇతర డైరెక్టర్లతో పనిచేసేందుకు షారుక్‌కు స్వేచ్ఛ ఇచ్చారు. తాను ప్రమోట్ చేసినందుకు గాను.. షారుక్ రెమ్యునరేషన్‌లో 50 శాతం తీసుకొన్నారు. అంతేగానీ షారుక్ ఖాన్‌కు సినిమాలు లేకుండా చేయలేదు అని కంగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

  English summary
  Bollywood fire brand, Actress Kanagana Ranaut fires on Bollywood in Republic Television's Arnab Goswami interview. She made sensational comments in the interview. This interview promo goes viral in the social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X