twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చుకున్న కంగనా రనౌత్!

    |

    కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ 'జడ్జిమెంటల్ హై క్యా' క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సక్సెస్ ఆనందంలో ఉన్న ఆమె తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయింది. ఖరీదైన బెంజ్ కార్ కొనుగోలు చేసింది.

    కంగనా రనౌత్ స్వస్థలం మనాలిలో తన అభిరుచికి తగిన విధంగా ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో కంగనాకు కారు ఉంది కానీ... మనాలి రెసిడెన్సీలో కారు లేక పోవడంతో 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా ద్వారా వచ్చి డబ్బుతో బెంజ్ కారు కొనుగోలు చేసిందట.

    ఈ విషయాన్నికంగనా సోదరి రంగోళి వెల్లడిస్తూ... 'కంగనాకు మనాలిలో కారు లేదు. తన కోసం ఇలాంటివి కొనుగోలు చేయడానికి ఆమె సమయం కూడా లేదు. అందుకే సీఏ మనోజ్ దంగా సర్, నేను కలిసి ఆమె కోసం ఈ కారు కొని సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాం. కానీ కంగనాకు సర్‌ప్రైజెస్ అంటే నచ్చవు. ముఖం అదోలా పెడుతుంది' అని రంగోళి చండేల్ ట్వీట్ చేశారు.

    Kangana bought Benz car for Manali residency

    'జడ్జిమెంటల్ హౌ క్యా' మూవీ విషయానికొస్తే... కంగనా రనౌత్‌తో పాటు రాజ్ కుమార్ రావు, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఈ సినిమా విడుదలైన తొలివారాంతం రూ. 19.25 కోట్లు రాబట్టింది.

    ప్రస్తుతం కంగనా రనౌత్ 'పంగా' అనే చిత్రంలో నటిస్తోంది. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహింస్తున్న ఈ మూవీలో కబడ్డీ ప్లేయర్‌గా కనిపించబోతోంది. ఈ మూవీ తర్వాత ఆమె జయలలిత బయోపిక్ చేయబోతున్నారు.

    English summary
    "Kangana didn’t have a car in Manali, and she never has time to buy such things for herself ha ha, her CA Manoj Daga sir and I surprised her with this new purchase for her , wish I was there to see her pleased and at the same time annoyed face(she hates surprises)" Rangoli Chandel tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X