డబ్బు కోసం కక్కుర్తి అంటూ అవమానం.. ఇప్పుడు హృతిక్ పరిస్థితి ఏంటి.. కంగన ఫైర్
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం గరంగరంగా ఉంది. సుశాంత్ మృతి, నెపోటిజంపై చర్చ, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటి వారిపై నెటిజన్స్ ఫైర్ అవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా మ్యూజిక్ ఇండస్ట్రీ తరుపున సోను నిగమ్ పోరాటం చేస్తున్నాడు. బాలీవుడ్ మాఫియా, నెపోటిజంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉంది. ఈ మధ్య కంగనా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. సుశాంత్ మరణం తరువాత కంగనా వ్యాఖ్యలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

సుశాంత్ మృతిపై..
డిప్రెషన్‌కు గురైన సుశాంత్ జూన్ 14న తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంత వరకు అనుచుకున్న కోపంతో నెపోటిజాన్ని చీల్చి చెండడారు. కొందరు సెలెబ్రిటీలు సైతం నెపోటిజాన్ని ప్రశ్నించారు.

కంగనా ఫైర్..
నెపోటిజం, మాఫియాపై కంగనా రనౌత్ ఎప్పటినుంచో గొంతు చించుకుని అరుస్తూనే ఉంది. అయితే ఆమె ఆవేదన ఇన్నాళ్లకు ప్రజలకు అర్థమైంది. సుశాంత్ మరణం తరువాత కంగనా మాట్లాడినవి కరెక్టేనని ఒప్పుకున్నారు. క్రెడిట్ ఇవ్వకపోవడం, బయటి వారిని ఎదగనివ్వకపోవడం వంటి వాటిపై కంగనా ఫైర్ అయింది.

కంగనా ప్రేమ విషయం..
కంగనా రనౌత్ హృతికో రోషన్ ప్రేమ విషయం గురించి తెలిసిందే. అయితే విడిపోయిన తరువాత కూడా కంగనా హృతిక్‌ను సాధించేది. ప్రతీసారి ఏదో ఒక కామెంట్ చేయడం, హృతిక్‌ను టార్గట్ చేయడం, వార్తల్లో నిలవడం వంటివి చేస్తూ వచ్చేది. తాజాగా హృతిక్‌పై పరోక్ష కామెంట్లు చేసింది.

డబ్బు కోసమే అని..
తాను సినీ జీవితం ప్రారంభించే సమయంలో తనకు ఎలాంటి లక్ష్యాలూ లేవని కంగనా చెప్పింది. అయితే, తన మాజీ ప్రియుడితో ప్రేమలోపడ్డ అనంతరం లీగల్ కేసు కొనసాగిందని తెలిపింది. ఆ సమయంలో జరిగిన చర్చలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పుకొచ్చింది. డబ్బుల కోసమే తన వెంటపడ్డానని హృతిక్ రోషన్ కూడా తన స్నేహితులకు చెప్పుకున్నాడని కంగనా రనౌత్ పేర్కొంది.
Recommended Video

తాను సొంతింట్లో..
అయితే ప్రస్తుతం తన మాజీ ప్రియుడు అద్దె ఇంట్లో జీవిస్తుంటే తాను మాత్రం సొంత ఇల్లు, కార్యాలయాన్ని కొన్నానని గర్వంగా చెప్పుకుంటున్నానని తెలిపింది. తనకు డబ్బులపై ఆశలేదని, అయితే, తనను ఆస్తికోసం ప్రేమించే అమ్మాయిగానే అందరూ చూశారని చెప్పుకొచ్చింది. సమాజం అమ్మాయిల్ని అలాగే చూస్తోందని అది నిజం కాదని ఎలా నిరూపించుకోవాలో తనకు అర్థం కాలేదని చెప్పింది.


Click it and Unblock the Notifications











