మూవీ మాఫియా గ్యాంగ్ ఇంట్లోనే దాక్కోండి.. ‘జల్లికట్టు’ను ప్రశంసించిన కంగన

కరోనా లాక్డౌన్ సమయంలో కంగనా రనౌత్ చేసినంత రచ్చ ఇండియాలో మరెవ్వరూ చేసి ఉండరు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తరువాత కంగనా రనౌత్ చేసిన కామెంట్స్, ఆరోపణలు, మాట్లాడిన మాటలు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ అది బాలీవుడ్ చేసిన హత్య అంటూ రకరకాల కామెంట్స్ చేసింది. చివరకు డ్రగ్స్ వ్యవహారంలోనూ కంగనా సంచలన కామెంట్స్ చేసింది. చివరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి బద్ద శత్రువులా మారింది.

ఇప్పుడు తాజాగా కంగనా జల్లికట్టు సినిమా గురించి మాట్లాడుతూ బాలీవుడ్, సినీ పెద్దలు, మూవీ మాఫియాను గెలికింది. మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన 'జల్లికట్టు' చిత్రం 93వ ఆస్కార్‌ పురస్కారాల పోటీకి భారతదేశం తరఫున ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జల్లికట్టును అభినందిస్తూ బాలీవుడ్‌ను టార్గెట్ చేసింది కంగనా. ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Kangana Ranaut About Jallikattu Entry For Oscar

ప్రతిఒక్కరిపై అధికారం చలాయించాలని చూసే బుల్లీదావుద్ (Bullydawood) గ్యాంగ్‌కు సరైన ఫలితాలు వచ్చాయి. భారతీయ చిత్రపరిశ్రమ అనేది కేవలం నాలుగు కుటుంబాలకు మాత్రమే చెందింది కాదు. మూవీ మాఫియా గ్యాంగ్‌ ఇళ్లలోనే దాక్కొండి.

ఎందుకంటే.. జ్యూరీ తన విధిని నిర్వర్తిస్తుంది. 'జల్లికట్టు' చిత్రబృందానికి కంగ్రాట్స్‌ అంటూ అదిరిపోయే కౌంటర్ వేసింది. ప్రస్తుతం జల్లికట్టు సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆంటోని వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌ జోసి, సబుమన్‌ అబ్దుసమద్‌, సంత్య బాలచంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లిజో దర్శకత్వం వహించగా..థామస్‌ పణికర్‌ నిర్మించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X