twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్ కోసం కష్టాలు పడ్డాం.. కానీ 100 కోట్లు కోల్లగొట్టింది.. వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పింది

    |

    బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ నటించిన మణికర్ణిక చిత్రం సగటు అభిమానులనే కాకుండా సినీ విమర్శకులను మెప్పించింది. రిలీజ్‌కు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ చిత్రం రికార్డుస్థాయి కలెక్షన్లు సాధించింది. యూరీ లాంటి సంచలన సినిమా ధాటిని సమర్ధంగా ఎదుర్కొని ఈ చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా రూ.100 కోట్లు సాధించడంపై చిత్ర యూనిట్, డైరెక్టర్, హీరోయిన్ కంగన రనౌత్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. మణికర్ణిక చిత్రం అరుదైన ఫీట్‌ను సాధించడంపై కంగన స్పందిస్తూ..

    సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాం

    సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాం

    మణికర్ణిక చిత్రం రిలీజ్ అవుతుందా అనే ప్రశ్న లేచింది. విడుదల చేయడానికి ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితుల్లో మణికర్ణిక చిత్రం రిలీజైంది. మార్కెట్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు మా చిత్రానికి పట్టం కట్టారు అని కంగన రనౌత్ అన్నారు.

     యూరీ నుంచి గట్టిపోటి ఎదురైంది

    యూరీ నుంచి గట్టిపోటి ఎదురైంది

    యూరీ సినిమా నుంచి గట్టిపోటి ఎదురవుతుందని అనుకోలేదు. మా చిత్రం మాదిరిగానే దేశభక్తి ప్రధానంగా రూపొందిన చిత్రం కావడంతో ప్రేక్షకులు ఆదరణ చూపారు. మణికర్ణిక, యూరీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నవ్వా, నేనా? అన్నట్టు కలెక్షన్ల వర్షం కురపించాయి. యూరీ చిత్రం రూ.200 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం తెలిసిందే.

    చెత్త సినిమాలు బుట్టలోకి వెళ్లాయి

    చెత్త సినిమాలు బుట్టలోకి వెళ్లాయి

    మణికర్ణిక చిత్రంతోపాటు చాలా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే చెత్త సినిమాలను ప్రేక్షకులు నిర్ద్వందంగా రిజెక్ట్ చేశారు. యూరీ, మణికర్ణిక సినిమాలు ఆరోగ్యవంతమైన పోటీని ఎదుర్కొన్నాయి. వివాదాలు సినిమా కలెక్షన్లను నిలువరించలేకపోయాయి. విమర్శకుల ప్రశ్నలకు గట్టి సమాధానం ఇచ్చాయి.

    సినీ చరిత్రలోనే మైలురాయిగా

    సినీ చరిత్రలోనే మైలురాయిగా

    బాలీవుడ్‌లో ఇప్పటి వరకు రూపొందిన పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల బడ్జెట్‌లో మూడో వంతుతో రూపొందింది. లక్కీగా మేము పెట్టిన బడ్జెట్ రికవరీ అయింది. అంతేకాకుండా సినిమా పరిశ్రమలోనే మైలురాయిగా నిలిచిన చిత్రంగా నలిచిందని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

    English summary
    Manikarnika: The Queen of Jhansi starring Kangana Ranaut has crossed the Rs 100 crore mark in its fourth week of release. And the actor-director is more than ecstatic. Kangana said, "There was a time when the film's release looked difficult.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X