For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రణ్‌బీర్‌తోపాటు ఆ ఇద్దరు హీరోలకు రక్త పరీక్షలు జరిపించాలి.. నన్ను కూడా‌‌ ఉరి తీసేవాళ్లే: కంగన ఫైర్

  |

  బాలీవుడ్ బాడా హీరోలు, దర్శక, నిర్మాతలపై హీరోయిన్ కంగన రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాలీవుడ్‌ ప్రముఖులకు డ్రగ్ మాఫియాతో బలమైన సంబంధాలున్నాయని ఆరోపించారు. హీరోలు కొందరు తమకు నచ్చిన వాళ్లను పార్టీలో చేర్చుకొంటారు.. ఆ సమయంలోనే డ్రగ్స్ విపరీతంగా వాడుతారనే ఆరోపణలు చేశారు. తాజాగా జాతీయ టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన చక్రవర్తి మాట్లాడుతూ..

   రియాను కలిసిన తర్వాతే సుశాంత్‌కు

  రియాను కలిసిన తర్వాతే సుశాంత్‌కు

  రియా చక్రవర్తితో అఫైర్ తర్వాతే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కెరీర్ దిగజారడం ప్రారంభించింది. ఆమెను కలిసిన తర్వాతే ఓ రకమైన మానసిక రుగ్మతకు సుశాంత్ లోనయ్యాడు. రియాను కలువక ముందు అతడికి డిప్రెషన్ లేదు. డిప్రెషన్ ఉన్నంత మాత్రాన ఎవరూ సూసైడ్ చేసుకోరు అని కంగన రనౌత్ అభిప్రాయపడ్డారు.

  90 శాతం మందికి డ్రగ్స్ అలవాటు

  90 శాతం మందికి డ్రగ్స్ అలవాటు

  బాలీవుడ్‌లో తీవ్రస్థాయిలో డ్రగ్ సంస్కృతి పేరుకుపోయింది. బడా హీరోలు, హీరోయిన్లు, ప్రముఖులు కలిసి చేసుకొనే పార్టీలో విపరీతంగా డ్రగ్స్ వాడుతారు. దాదాపు 99 శాతం మంది సినీ ప్రముఖులకు డ్రగ్ వాడే అలవాటు ఉంది. సరైన విచారణ జరిగితే అందరూ జైల్లో ఉండే పరిస్థితి ఉంది. ఏదో ఒక సమయంలో చిన్న చితక హీరోల నుంచి బడా హీరోల వరకు ఈ అలవాటు ఉంది అని కంగన చెప్పారు.

  హీరోలకు బాల్యం నుంచే డ్రగ్స్ అలవాటు

  హీరోలకు బాల్యం నుంచే డ్రగ్స్ అలవాటు

  బాలీవుడ్‌లో డ్రగ్ మాఫియాను అణిచివేసేందుకు అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. కానీ సినీ ప్రముఖుల మాత్రం ఆ సంస్కృతిని ప్రోత్సహిస్తూనే వస్తున్నాయి. కొందరు యాక్టర్లకు బాల్యం నుంచే డ్రగ్స్ వాడే అలవాటు ఉందనే విషయం అందరికీ తెలిసిందే. నేను డేటింగ్ చేసిన హీరోతో చాలా పార్టీలకు వెళ్లాను. అక్కడ చాలా మంది డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్‌తో తయారు చేసిన సిగరెట్లు, మాత్రలు వేసుకోవడం చూశాను అని కంగన చెప్పారు.

  ఆ హీరోలకు రక్త పరీక్ష నిర్వహించాలి

  ఆ హీరోలకు రక్త పరీక్ష నిర్వహించాలి

  బాలీవుడ్‌లో డ్రగ్ సంస్కృతిని అరికట్టాలంటే హీరోలు, నటులు హిందూ వ్యతిరేకులా.. హిందూ మతాన్ని సమర్థించేవారా అనే అంశాలను చూడకూడదు. వారు ఏదైనా సినిమాలో నటిస్తున్నారంటే.. ఆ సినిమా షూటింగుకు ముందు వారికి రక్త పరీక్షలు జరిపించాలే. రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ కపూర్, వికీ కౌశల్ లాంటి హీరోలకు రక్త పరీక్షలు చేయిస్తే తెలిసిపోతుంది. ఎవరు డ్రగ్స్ వాడుతారు? ఎవరు వాడరనే విషయం స్పష్టమవుతుంది. ఇలాంటి పరీక్షలు చేస్తే బాలీవుడ్‌ నుంచి డ్రగ్ మాఫియాను తరిమివేయవచ్చు అని కంగన రనౌత్ అభిప్రాయపడ్డారు.

  Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
   నన్ను కూడా జైల్లో పెట్టాలని ప్రయత్నించారు

  నన్ను కూడా జైల్లో పెట్టాలని ప్రయత్నించారు

  బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం గురించి బాగా తెలుసు అనే ఒకే ఒక కారణంతో నన్ను వెలివేసేందుకు ప్రయత్నించారు. పార్టీలకు ఆహ్వానించకుండా అడ్డుకొన్నారు. వారి వ్యవహారాలు బయట వ్యక్తులకు తెలియడానికి ఒప్పుకోరు. సినిమా పరిశ్రమకు సంబంధం లేని నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయనే కారణంతో నన్ను దూరంగా పెట్టారు. వారు నన్ను జైల్లో పెట్టడానికి ప్రయత్నించారు. నేను వారిని గట్టిగా ఎదుర్కొనకపోతే నన్ను కూడా ఫ్యాన్‌కు వేలాడ దీసేవారే అని కంగన సంచలన వ్యాఖ్యలు చేశారు.

  English summary
  Bollywood Actress Kangana Ranaut tweet goes viral over Drug links with Bollywood. She revealed that Bollywood super hero had hospitalised with overdose of drugs. After that his wife given divorce to him and she said she had affair after the breakup with his wife.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X