ఒక్కొక్కరి అంతు చూస్తా, రాసలీలలన్నీ బయట పెడతా.. వైరల్ అవుతున్న హీరోయిన్ వీడియో!

Recommended Video

Kangana Ranaut Fires On Bollywood Industry | Filmibeat Telugu

కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. ఎన్ని వివాదాలు ఉన్నా కంగనాకు అంతే స్థాయిలో క్రేజ్ కూడా ఉంది. నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం కంగనా రనౌత్ ప్రత్యేకత. పలు చిత్రాల్లో తన పెర్ఫామెన్స్ తో కంగనా రనౌత్ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. కంగనా రనౌత్ ఇటీవల నటించిన మణికర్ణిక చిత్రం విజయ పథంలో దూసుకుపోతోంది. ఈ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

 మణికర్ణిక స్పెషల్ స్క్రీనింగ్

మణికర్ణిక స్పెషల్ స్క్రీనింగ్

పోస్ట్ రిలీజ్ తర్వాత కూడా మణికర్ణిక చిత్రం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్కూల్ పిల్లలకు, బాలీవుడ్ ప్రముఖుల కోసం ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసారు. ఇప్పటికే మణికర్ణిక చిత్రం మంచి వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా పెర్ఫామెన్స్, పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటికే మణికర్ణిక చిత్రం వలన కంగనా, క్రిష్ మధ్య విభేదాలు తలెత్తాయి.

 నాపై కుట్ర చేసే గ్యాంగ్

నాపై కుట్ర చేసే గ్యాంగ్

మణికర్ణిక స్పెషల్ స్క్రీనింగ్ కోసం బాలీవుడ్ ప్రముఖుల్ని కూడా ఆహ్వానించినట్లు కంగనా రనౌత్ తెలిపింది. వారిలో చాలా మంది హాజరు కాలేదు. వాళ్లంతా నాపై కుట్ర చేసే గ్యాంగ్ అంటూ కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను బాలీవుడ్ లో ఉన్నా వారసత్వ పోకడలు, లైంగిక దాడుల గురించి మాట్లాడడం వలనే కుట్ర పన్నుతున్నారు. నేనంటే అంతగా భయపడుతున్నారు. మణికర్ణిక చిత్రానికి వారంతా మద్దత్తు తెలపకపోవడానికి కారణం ఇదే అని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ఒక్కొక్కరి అంతు చూస్తా

నాపై కుట్ర చేసే వాళ్ళ జాతకాలాన్ని నా దగ్గర ఉన్నాయ్. ఒక్కొక్కరి రాసలీలన్నీ బయట పెట్టి అంతు చూస్తా అంటూ కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కంగనా రనౌత్ ఇప్పటికే అలియా భట్, అమిర్ ఖాన్ లాంటి ప్రముఖుల్ని విమర్శించిన సంగతి తెలిసిందే. వాళ్ళెవరూ నా చిత్రాన్ని చూడడానికి రాలేదని తెలిపింది.

క్రిష్‌తో విభేదాలు

క్రిష్‌తో విభేదాలు

ఇదిలా ఉండగా కంగనా రనౌత్ మణికర్ణిక చిత్రం దర్శకత్వ క్రెడిట్ విషయంలో క్రిష్ తో విభేదిస్తున్న సంగతి తెలిసిందే. తానే ఎక్కువ భాగం షూటింగ్ చేసానని కంగనా రనౌత్ ప్రకటించుకుంది. చిత్ర కథ విషయంలో విభేదాల కారణంగా క్రిష్ చివర్లో మణికర్ణిక నుంచి తప్పుకున్నాడు. క్రిష్ తో జరిగిన వాట్సాప్ సంభాషణని లీక్ చేయడం, దానిని క్రిష్ ఖండించడం లాంటి ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X