For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా మాజీ ప్రియుడు సిల్లీ ఫెలో.. ఇప్పటికీ అదే బుద్ది.. హృతిక్‌పై ఘాటుగా కంగన

    |

    బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్, ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్ మధ్య ముగిసిపోయిందనుకొన్న ప్రేమ వివాదం మళ్లీ కోర్టు మెట్లేక్కింది. కంగనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ హృతిక్ రోషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మొదలైంది. ఆ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే...

    కైట్స్ సినిమా సమయంలో డేటింగ్

    కైట్స్ సినిమా సమయంలో డేటింగ్

    హృతిక్ రోషన్, కంగన రనౌత్ కలిసి 2010లో కైట్స్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రానికి హృతిక్ తండ్రి నిర్మాత, దర్శకుడిగా వ్యవహారించారు. ఆ సమయంలో వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో కొనసాగారు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఊహించని విధంగా వారిద్దరూ విడిపోవడం వివాదంగా మారింది.

    పూజా హెగ్డే హాట్ ఫోటో‌షూట్.. మీరెప్పుడూ చూడని ఫోటోలు వైరల్‌గా

    హృతిక్‌తో ఈమెయిల్స్ వివాదం

    హృతిక్‌తో ఈమెయిల్స్ వివాదం

    2016లో హృతిక్, కంగనా లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో వారిద్దరూ పంపుకొన్న ఈమెయిల్స్ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఆ కేసు విషయంలో ముంబై పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేయడానికి హృతిక్‌కు సమన్లు జారీ చేశారు.

    నకిలీ ఈమెయిల్ ద్వారా వేధింపులు

    నకిలీ ఈమెయిల్ ద్వారా వేధింపులు

    నకిలీ ఈమెయిల్ ఐడీ ద్వారా తన పేరుతో వందలాది ఈమెయిల్స్ పంపుతున్నారు. నన్ను విపరీతంగా వేధిస్తున్నారు. అందుకు కారణం కంగన రనౌత్ కుట్రనేనని తన ఫిర్యాదులో ఆరోపించారు. అయితే దానికి కంగన బదులిస్తూ.. తాము ఇద్దరం ప్రేమలో ఉన్న సమయంలో హృతిక్ తనకు ఆ ఈమెయిల్ ఐడీ ఇచ్చారు. ఆ ఈమెయిల్ ఐడీ ద్వారానే తాము మెయిల్స్ పంపుకొన్నాం అని కంగన సమాధానం ఇచ్చింది.

    కంగన ట్వీట్ వైరల్

    కంగన ట్వీట్ వైరల్

    కంగనపై ఫిర్యాదు చేసిన అంశంలో హృతిక్ రోషన్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ క్వీన్ ఘాటుగా స్పందించారు. ప్రపంచమంతా మారిపోయి ముందుకు వెళ్తున్నది. కానీ నా మాజీ ప్రియుడు సిల్లీగా అక్కడే ఆగిపోయాడు. కాలం కూడా వెనకకు పోలేదు. కానీ నా మాజీ ప్రియుడు వెనక్కి వెళ్లి వివాదాన్ని తిరగదోడుతున్నాడు అంటూ కంగన ట్వీట్ చేసింది.

    English summary
    Bollywood actors Kangana Ranaut and Hrithik Roshan's Email controversy: Hrithik is attending before mumbai crime branch. In this occassion, Kangana tweets, Duniya kahan se kahan pahunch gayi magar mera silly ex abhi bhi waheen hai usi modh pe jahan yeh waqt dobara laut ke nahi jane wala ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X