రేప్ చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా?.. నిన్ను చూస్తే సిగ్గేస్తోంది.. కంగనాపై ఘాటు వ్యాఖ్యలు!
ప్రస్తుతం దేశంలో కంగనా వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి, శివసేన పెద్దలకు వ్యతిరేకంగా నిలబడింది. ముంబైలోని కంగనా కార్యాలయాన్ని కూలగొట్టడం, ఈ మేరకు కంగనా కోర్టులో కేసు వేయడం ఇవన్నీ అందరికీ తెలిసింది. శివసేన, కంగనా మధ్య మాటల యుద్దం జరగడం పెద్ద రచ్చకు దారి తీసింది. అక్రమ కట్టడం అనే నెపంతో తన ఆఫీస్‌ను కూలగొట్టడంపై కంగనా ఓ కామెంట్ చేసింది.

రేప్ చేసినట్టుగా ఫీలయ్యా..
ముంబై, మహారాష్ట్రను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో కంగనా పోల్చడంతో వివాదం మొదలైంది. అది చినికి చినికి గాలి వానలా మారి చివరకు కంగనా కార్యాలయాన్ని కూలగొట్టేవరకు వెళ్లింది. ఇక ఈ విషయంపై తాజాగా కంగనా మాట్లాడుతూ.. అలా తన కార్యాలయాన్ని కూలగొడుతూ ఉంటే తనను రేప్ చేసినంత బాధగా అనిపించిందని చెప్పుకొచ్చింది.

ఆ వ్యాఖ్యలపై ఫైర్..
కంగన అలా రేప్‌తో పోల్చడంతో సామాజిక కార్యకర్త యోగిత మండిపడింది. అత్యాచార బాధితుల తరుపున పోరాడే యోగిత కంగనా వ్యాఖ్యలపై ఫైర్ అయింది. కార్యాలయాన్ని కూలగొట్టడాన్ని, అత్యాచార ఘటనను ఎలా పోలుస్తావ్. అది అంగీకారం కాదని తెలిపింది. అత్యాచారం చేస్తే ఎలాంటి బాధ కలుగుతుందో నీకు తెలుసా?.. ఎప్పుడైనా బాధితురాలిని నువ్ కలిశావా? వారిని అడిగితే చెబుతారు.. రేప్‌కు గురైతే ఎలాంటి బాధ కలుగుతుందో?.. నీలాంటి ఫేక్ ఫెమినిస్ట్‌ను చూస్తే సిగ్గేస్తోంది అని ట్వీట్ చేసింది.

నీకు రేప్ అంటే...
యోగిత చేసిన ట్వీట్‌కు కంగనా స్పందించింది. మీలాంటి నడి వయస్కులైన ఫెమినిస్ట్‌ల నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆశిస్తాం.. మీకు రేప్ అంటే కేవలం వెజీనానే. కానీ కొందరు ఆడవాళ్లు వాటిని మనసు, మెదడులతో చూస్తారు.. మీకు అది అర్థం కాదులే అంటూ కౌంటర్ వేసింది.

కంగనాపై భిన్న స్పందనలు..
కంగనా రనౌత్‌పై భిన్న రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఇక జయా బచ్చన్ వ్యాఖ్యలను ఖండించడంతో బాలీవుడ్ మొత్తం కంగనాపై విరుచుకుపడింది. సోషల్ మీడియాలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇక కొందరు కంగనాకు మద్దతు తెలుపుతున్నారు.. మరి కొందరు కంగనాను ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











