నిన్ను ఎవరైనా హీరో గోకితే ఏం చేస్తావు? స్టార్ హీరో ప్రశ్నకు టాప్ హీరోయిన్ దిమ్మతిరిగే జవాబు!

దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోలో జోష్ కనిపిస్తున్నది. హిందీలో ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్ 17 సీజన్ రంజుగా సాగుతున్నది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో గొడవలు, కొట్లాటలు, ఒకరిపై మరొకరు మాటల దాడులు చేసుకొంటూ షోను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక వారాంతంలో వీకేండ్ వార్ పేరుతో సల్లూభాయ్ ఇంటిని చక్కబరిచే ప్రయత్నం చేస్తున్నారు. వారాంతంలో ఈ సార్ సల్మాన్ ఖాన్‌తో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ జతకలిసింది. అయితే సల్మాన్, కంగన రనౌత్ మధ్య జరిగిన సరదా సంభాషణ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి హోస్టింగ్ చేసేందుకు ప్రయత్నించింది. హలో.. అద్బుతమైన నటి.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కంగనను ఆహ్వానిద్దాం అంటూ స్వయంగా ఆమె చెప్పుకొంటుండగా.. వెనుకనే సల్మాన్ ఖాన్ వచ్చి ఎలా ఉన్నావు అంటూ షాకిచ్చాడు. నేను బాగున్నాను.. నీవు ఎలా ఉన్నావు అంటూ అడిగితే.. నవ్వుతూ బాగున్నాను అని సమాధానం చెప్పాడు. వెంటనే ఓ కౌగిలింత ఇచ్చి సరదాగా మాటల్లోకి దిగిపోయారు.

Kangana Ranaut befitting reply to Salman Khan at Bigg Boss 17s Weekend Vaar

కంగన రనౌత్‌తో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. నన్ను కూడా వదలవా? అని సల్మాన్ ఖాన్ అంటే.. నన్ను అవమానిస్తే నేను ఎవరిని వదిలిపెట్టను అంటూ ఆమె కామెంట్ చేసింది. ఆ తర్వాత నీకు ఎవరైనా లైన్ వేసి బుట్టలో వేసుకొంటే.. నీవు ఏం చేస్తావు అంటే.. నీ లాంటి అందగాడు అలా చేస్తే.. నా మనసుతో ఆ పని కానిచ్చేస్తాను అంటూ సమాధానం చెప్పింది. దాంతో సల్మాన్ ఖాన్ ఇంప్రెస్ అయిపోయాడు. ఆ తర్వాత స్టెప్పులేస్తూ హంగామా చేశారు.

ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌ను ఆటపట్టిస్తూ.. నీ టాలెంట్ ప్రదర్శించి నన్ను నీ బుట్టలో వేసుకో అని కంగనా అంటే.. నీవు చాలా అందంగా ఉన్నావు.. 10 ఏళ్ల తర్వాత ఏం చేస్తుంటావు అని సల్మాన్ అడిగాడు. దాంతో కంగన కూడా ఫుల్లుగా ఇంప్రెస్ అయింది. ఉత్సాహంగా సాగిన వారి సంభాషణకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. వారాంతంలో ఆదివారం ప్రసారమయ్యే ఈ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Kangana Ranaut befitting reply to Salman Khan at Bigg Boss 17s Weekend Vaar

అయితే కంగన రనౌత్ ప్రస్తుతం తాను నటించిన తేజస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ వేదికపైకి వెళ్లారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి ఎలా ఎంజాయ్ చేసిందనే విషయం తెలుసుకోవాలంటే.. కలర్స్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X