సిగ్గులేకుండా అడుగుతారు, అమీర్ ఖాన్ కూడా అలాంటోడే: కంగనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ స్టార్స్ మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. చాలా మంది తనకు సహాయం చేసే విషయంలో వెన్ను చూపారని, ఎవరూ సపోర్ట్ చేయలేదని మండిపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... కొందరు స్టార్స్ సిగ్గులేకుండా నాకు ఫోన్ చేసి వారి చిత్రాలు ప్రమోట్ చేయమని కోరుతారు, కానీ వారు తిరిగి మనకు ఫేవర్ చేయడానికి ఆసక్తి చూపరు అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ ముందు నుంచీ తనను నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యంగా తన సినిమా సమయంలో ఎవరూ తనను పట్టించుకోరని తెలిపారు.

అపుడు కూడా నాకు వచ్చిన ప్రశంసలు కాదు...
2014లో క్వీన్ సినిమా సమయంలో ప్రశంసలు నాకు దక్కాయని నేను భావించడం లేదు. అవి ఫాంటమ్ సంస్థ తరుపున సినిమాను ప్రదర్శించిన వికాస్, అనురాగ్ కశ్యప్‌లకు దక్కాయి. నేను ఎల్లప్పుడూ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాను.

నేను కూడా అలాంటి పనులు మానేశాను
‘తను వెడ్స్ మను' సమయంలో కూడా చాలా ప్రివ్యూస్ వేశాం. చాలా మంది రావడానికి ఇష్టపడలేదు. కానీ వారి సినిమాల విషయానికొచ్చేసరికి... సిగ్గు లేకుండా నాకు ఫోన్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో నేను షూటింగ్ కేన్సిల్ చేసుకుని కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి పనలు చేయడం మానేశాను. అలాంటి వారి కోసం వెళ్లడం టూమచ్ అనిపించిదని కంగనా తెలిపారు.

అలియా భట్ గురించి...
అలియా భట్ లాంటి అమ్మాయిలు వారి సినిమా(రాజి) ట్రైలర్లు నాకు పంపి ‘ప్లీజ్ చూడండి' అని కోరతారు. కానీ నా సినిమా విడుదల సమయంలో మాత్రం సపోర్ట్ చేయరు. నా వరకు.. అది కరణ్ జోహార్ సినిమా కానీ, అలియా భట్ సినిమా కానీ కాదు. నా దృష్టిలో అది ఈ దేశం కోసం తన సర్వస్వం ఇచ్చేసిన సెహమత్ ఖాన్ సినిమా అని తెలిపారు.

అమీర్ ఖాన్ కూడా అలాంటోడే
అమీర్ ఖాన్ మీద కూడా కంగనా విరుచుపడింది. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సమయంలో అమీర్ ఖాన్ కాల్ చేసినపుడు... నేను అంబానీ ఇంటికి ప్రివ్యూ చూడటానికి వెళ్లాను. కానీ వారికి మాత్రం నా సినిమా చూడటానికి వచ్చే సమయం ఉండదు అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











