కంటతడి పెట్టిన కంగన రనౌత్.. భోరున ఏడ్వడంపై సిబ్బంది ఎమోషనల్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ నటి కంగన రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వంపై, అలాగే బాలీవుడ్ కోటరిపై భగ్గుమన్నారు. మహారాష్ర ప్రభుత్వంలోనీ ఓ కీలక వ్యక్తి కారణంగానే సుశాంత్ మరణించారు. సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సుశాంత్‌ది హత్యే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో కంగనను మహారాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసుకొన్నదనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కంగనపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించిందంటే ..

సుశాంత్ మరణానికి కారణం వారే
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నేపథ్యంలో కంగన రనౌత్ జాతీయ ఛానెల్‌కు ఇంటర్వ్వూలు ఇస్తూ మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమున్న కొందరు కీలక నేతల కారణంగానే సుశాంత్ మరణించారు. అందుకు బాధ్యతను వారే వహించాలని కామెంట్ చేశారు.

మహారాష్ట్ర సర్కార్ కక్ష సాధింపు చర్య
అయితే తమను టార్గెట్‌గా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందనే ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తన ఎంతో సుందరంగా నిర్మించుకొన్న ఆఫీస్‌పై బాంబే మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. యంత్రాలతో కంగన ఆఫీస్‌ను కూల్చివేయడం వివాదంగా మారింది.

నిబంధలకు అనుగుణంగానే భవన నిర్మాణం
అయితే నిబంధనలకు వ్యతిరేకంగా ఉందంటే తన ఆఫీస్‌ను కూల్చివేయడానికి ప్రయత్నించిన అధికారులు, మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన రనౌత్ మండిపడ్డారు. నిబంధనలకు అనుగుణంగా కట్టుకొన్న ఆఫీస్‌ను కూల్చివేయడం మహా సర్కార్ ప్రతీకార చర్య అంటూ కామెంట్లు చేశారు. అంతేకాకుండా తన ఆఫీస్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.2.కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కంగన డిమాండ్ చేశారు.

ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిస కంటతడి
సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన మీటింగులను కంగన రనౌత్ తన ఆఫీస్‌లో పెట్టుకొంటారు. బీఎంసీ కూల్చివేతకు పాల్పడిన తర్వాత తొలిసారి తన సమావేశాలను ఆమె అక్కడే నిర్మించారు. ఈ సందర్భంగా తన ఆఫీస్ పరిస్థితిని చూసి కంటతడి పెట్టుకొన్నారు. శిథిలమైన ఆఫీస్‌ను చూసి భోరుమన్నారు. కంగన పరిస్థితి చూసి తన సిబ్బంది ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











