మీరు విలన్స్.. నేను హీరో.. కంగనా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. దానికి కారణం శివ సేన ప్రభుత్వానికి ధీటుగా నిలబడి కోర్డులో కేసు గెలిచింది. తాజాగా ఈ మేరకు బాంబే హైకోర్టు కంగనాకు అనుకూలంగా ఓ తీర్పును ఇచ్చింది. అక్రమ కట్టడం అంటూ తన ఆఫీస్‌ను బృహన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) కూల్చివేతకు పాల్పడటంపై కంగనా కేసు వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించిన తీర్పు నేడు వెలువడింది.

పరిహారం చెల్లించేలా తనకు న్యాయం చేయాలి అంటూ బాంబే హైకోర్టును కంగన ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కంగన పిటిషన్‌‌పై విచారణ జరిపిన కోర్టు.. సదరు ఆఫీసును కూల్చినందుకు బీఎంసీపై మండిపడింది. పిటిషనర్‌‌కు నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందిగా బీఎంసీని ఆదేశించింది. కాగా, ఈ తీర్పు వెలువడిన తర్వాత తనకు మద్దతుగా నిలిచిన వారికి కంగన కృతజ్ఞతలు తెలిపింది.

 Kangana Ranaut Comments On Bombay HC Verdict On Office Demolition Case

ఈ మేరకు కంగనా స్పందిస్తూ.. ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యక్తిగతంగా నిలబడి విజయం సాధిస్తారో అది వారొక్కరి గెలుపే కాదు. దాన్ని ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా చూడాలి. నాకు ధైర్యాన్ని ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే బద్దలైన నా కలలను చూసి నవ్విన వారికి కూడా కృతజ్ఞతలు. మీరు విలన్‌‌ పాత్రలో నటించారు కాబట్టే నేను హీరో అయ్యాను అని కంగన ట్వీట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X