నేను అలాంటి వారి పక్షాన నిలబడను.. జేఎన్‌యూ ఘటనపై కంగనా కామెంట్స్

దేశవ్యాప్తంగా దుమారం రేపిన జేఎన్‌యూ ఘటన సెగలు సెలెబ్రిటీలకు సైతం తాకింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సీటీలో కొందరు దుండగులు విద్యార్థులపై దాడికి దిగిన ఈ ఘటనను వ్యతిరేకంగా నిరసనలు చేసిన విద్యార్థుల పక్షాన దీపికా పదుకొణె నిలబడిన సంగతి తెలిసిందే. తన సినిమా ఛపాక్ ప్రమోషన్స్ కోసం ఢిల్లీ వెళ్లిన దీపికా.. అక్కడి విద్యార్థుల నిరసనలో పాల్గొంది. అయితే ఈ కారణంగా ఛపాక్‌కు నష్టాలు ఏర్పడ్డాయి.

జేఎన్‌యూ ఘటనలో దీపికా ఎంటర్ కావడంతో ఆమె చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని బీజేపీ నేతలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చాయి. దీంతో సినిమాకు ఆర్థిక నష్టాలు ఏర్పడ్డాయి. ఛపాక్ చిత్రానికి రాజకీయ రంగు పులుముకోవడంతో బాక్సాఫీస్ వద్ద వెలవెలబోయింది. ఇలాంటి ఘటనల్లో ధైర్యంగా నిలబడ్డ దీపికాకు కొందరు మద్దతు పలకగా..మరికొందరు ఆమెను టార్గెట్ చేశారు. కానీ మిగతా సెలెబ్రిటీలు ఎవ్వరూ ఈ ఘటనపై నోరు మెదపలేదు.

Kangana Ranaut Comments On JNU Incident And Deepika Padukone

తాజాగా జేఎన్‌యూ ఘటన, దీపికా సందర్శనపై కంగనా రనౌత్ మాట్లాడుతూ.. దీపికా ఏం చేసిందో, ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేయాల్సి ఉందో అనే వాటిపై తాను కామెంట్ చేయకూడదని చెప్పుకొచ్చింది. ఎవరికైనా భావప్రకటన స్వేచ్చ, హక్కులున్నాయని తెలిపింది. అయితే దేశాన్ని విభజించాలనుకునే వారి పట్ల, దేశం అంటే ప్రేమ లేని వారు, జవాన్లు చనిపోతే పండుగ చేసుకునేవారి పక్షాన నిలబడనని తేల్చి చెప్పింది. నేనేం చేయాలనుకుంటానే చెప్పగలను కానీ ఆమె చేసి ఉండాల్సిందో అనేవాటి గురించి చెప్పలేనని పేర్కొంది. ఛపాక్ సినిమాపై బాయ్ కాట్ ప్రకటించడంపై మాట్లాడుతూ.. మంచి సినిమాను ఎవ్వరూ ఆపలేరని, ఎవరో బాయ్ కాట్ చేసినంత మాత్రాన ఏమి జరగదని చెప్పుకొచ్చింది. కంగనా ప్రధాన పాత్రలో నటించిన పంగా చిత్రం జనవరి 24న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X