మరోసారి క్వీన్ అనిపించుకున్న కంగనా రనౌత్.. ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు
కంగనా రనౌత్ అంటే.. కాంట్రవర్సీ క్వీన్ అంటూ కొంతమంది ట్రోల్స్ బాగానే చేశారు. మరికొందరు ఆమెకు పిచ్చి ఎక్కువయ్యిందని హేళన చేశారు. అందులో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే కంగనా మాత్రం విమర్శలు ఎన్ని వచ్చినా ఒంటరిగానే ఎదుర్కొంది. తన టాలెంట్ తోనే ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది.
ఆమెకు ఇటీవల వచ్చిన నేషనల్ అవార్డుతో మొత్తంగా నాలుగు సార్లు ఆ గౌరవాన్ని అందుకున్న నటిగా గుర్తింపు అందుకుంది. మొదటిసారి 2008లో ఫ్యాషన్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్న కంగనా ఆ తరువాత 2014లో క్వీన్ సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది.

2015లో తను వెడ్స్ మను రిటర్న్స్ అలాగే 2021లో మణికర్ణిక, పంగా సినిమాలకు గాను ఆమె జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడంతో న్యూ రికార్డ్ క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా అభిమానుకు కంగనా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. బాలీవుడ్ అగ్ర నటిమణులకు పోటీని ఇవ్వడమే కాకుండా కంగనా స్టార్ హీరోల రేంజ్ లో 100కోట్ల మార్కెట్ ను సెట్ చేసుకుంటోంది. నెక్స్ట్ ఆమె తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











