పగటి పూట దేవతలా.. రాత్రి అయితే రేప్.. మహిళలపై కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు.. క్రిమినల్ అంటూ కంగన రనౌత్ ఫైర్

భారత ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యాక్టర్, కమెడియన్ వీర్ దాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే కొందరి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. వీర్ దాస్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం కావడంతో కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. వీర్ దాస్‌ను కడిగిపడేస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ఆ పోస్టులో వీర్ దాస్‌ను ఏమని టార్గెట్ చేసింది? వీర్ దాస్ చేసిన వ్యాఖ్యలు ఏమిటనే విషయంలోకి వెళితే..

 ఓ వైపు మానభంగాలు.. మరోవైపు రైతులు ఆందోళనలు

ఓ వైపు మానభంగాలు.. మరోవైపు రైతులు ఆందోళనలు

యాక్టర్, కమెడియన్ వీర్ దాస్ ఇటీవల వాషింగ్టన్ డీసీలోని జాన్ ఎఫ్ కెన్నెడీ సెంటర్‌లో ఓ ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్‌పై విద్వేషం చిమ్ముతూ ఆయన ఒక వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. నేను రెండు ముఖాలు ఉన్న భారత్‌ను చూశాను. భారత్‌లో ఓ వైపు మానభంగాలు.. మరో వైపు రైతులు ఆందోళనలు అంటూ దారుణంగా కామెంట్ చేశాడు. విదేశీ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడంపై అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

 రాత్రి కాగానే రేప్ చేస్తారు అంటూ

రాత్రి కాగానే రేప్ చేస్తారు అంటూ

అంతేకాకుండా జాన్ ఎఫ్ కెనడీ సెంటర్‌లో వీర్ దాస్ మాట్లాడుతూ.. రోజంతా మహిళలకు అత్యంత గౌరవం ఇస్తారు. దేవతలా పూజిస్తారు. కానీ రాత్రి కాగానే రేప్ చేస్తారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అత్యంత దుమారం రేపడంతో మేధావి, ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు.

వీర్ దాస్‌ ఓ క్రిమినల్ అంటూ

వీర్ దాస్‌ ఓ క్రిమినల్ అంటూ

భారత్‌ ప్రతిష్టను, గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వీర్ దాస్‌ తీరును బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌ ఎండగట్టింది. మగవాళ్లందరూ రేపిస్టులు అంటూ వ్యాఖ్యలుు చేసిన వీర్ దాస్‌ను ఓ కరుడు గట్టిన క్రిమినల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఇన్స్‌టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది.

నీ వ్యాఖ్యలు అహంకారపూరితం అంటూ

నీ వ్యాఖ్యలు అహంకారపూరితం అంటూ

భారత్‌లోని మగవాళ్లందరూ గ్యాంగ్ రేపిస్టులని జనరలైజ్ చేశాడు. నీ వ్యాఖ్యలు లింగ, వర్ణ వివక్షను తెలియజేస్తున్నాయి. ప్రపంచ వేదికలపై భారత్‌ ప్రతిష్టను కించపరిచే కుట్ర కనిపించింది. గతంలో చర్చిల్ చెప్పినట్టు.. ఇండియన్స్ అంతా రాబిట్స్ (కుందేళ్లు) వాళ్లంతా చావాల్సిందే అనే అహంకారపూరిత కామెంట్స్ మాదిరిగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి. శంగారంపై ఉన్న మోజు కారణంగానే భారత్‌లో లక్షలాది మంది ఆకలి చావులు చస్తున్నారు అని చర్చిల్ అవమానించాడు. అలాంటి సాఫ్ట్ టెర్రరిజంకు ఊతమిచ్చే మాదిరిగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి. నీలాంటి క్రిమినల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కంగన ఫైర్ అయింది.

Recommended Video

Latest Film Updates : Venkatesh Drushyam 2 కూడా OTT లోనే..! || Filmibeat Telugu
వీర్ దాస్‌పై కేసు నమోదు చేసిన బీజేపీ నేతలు

వీర్ దాస్‌పై కేసు నమోదు చేసిన బీజేపీ నేతలు

వీర్ దాస్ చేసిన వ్యాఖ్యల అనంతరం పలు వర్గాలు ఘాటుగా స్పందించాయి. దేశ ప్రతిష్టనే కాకుండా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడని వీర్ దాస్‌ తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీర్ దాస్‌పై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్టు వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X