Alia Bhatt పై మరోసారి Kangan Ranaut అక్కసు.. ఆమె సినిమా కలెక్షన్లపై సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న ఆలియా భట్, కంగనా రనౌత్ మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. కంగన గురించి ఆలియా ఎప్పుడూ బహిరంగంగా విమర్శలు చేయలేదు. అయితే కంగన మాత్రం వీలు దొరికినప్పుడల్లా ఆలియాను టార్గెట్ చేస్తుంటుంది. ఆమెను సోషల్ మీడియా ద్వారా నేరుగా విమర్శిస్తుంటుంది. ఆలియా తాజా చిత్రం గంగూభాయ్ కతియావాడిపై కంగన తాజాగా చేసిన విమర్శలు సంచలనంగా మారాయి.

సినిమా కలెక్షన్లు నిజం కాదు..
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా నటించిన తాజా చిత్రం `గంగూభాయ్ కతియావాడి`. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో నటనకు గానూ ఆలియాపై ప్రశంసలు కురిశాయి. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా విజయం సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. వంద కోట్ల క్లబ్‌లో చేరిందని టీమ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీనిపై ఓ బాలీవుడ్ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. `గంగూభాయ్ కతియావాడి` కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తున్నారని పేర్కొంది.

ఆలియాపై కంగన జాలి
ఆ కథనాన్ని కంగనా రనౌత్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆలియాపై జాలి కురిపించింది. `పాలల్లో నీళ్లు కలిపితే పలుచగా అవతాయి. కానీ, ఇక్కడ నీళ్లకు పాలను కలుపుతున్నారు. అయినా నిస్సహాయులకు ఇలాంటి సపోర్ట్ ఉండాలి మరి` అంటూ కామెంట్ చేసింది. నిజానికి సినిమా విడుదలకు ముందే ఆలియాపై కంగన విమర్శలు చేసింది. దాదాపు 200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అవ్వనున్నాయని కామెంట్ చేసింది. కాగా, కంగన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆలియా నిరాకరించింది.

వారం క్రితం తీవ్రంగా ట్రోలింగ్
తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీ ఉదయం కంగన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడింది. ఆ సమయంలో కంగన చుట్టూ సెక్యూరిటీగా సైనికులు దర్శనమిచ్చారు. దీంతో నెటిజన్లు కంగనపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు. `నేను కట్టే టాక్స్ తన సెక్యూరిటీ కోసమా?`, 'కంగనకు వై ప్లస్ సెక్యూరిటీ అవసరమా' అంటూ నెటిజన్స్ ట్రోలింగ్‌కు దిగారు.

బాలీవుడ్ స్టార్లపై అక్కసు
బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోహీరోయిన్లపై కంగన తరచుగా వివాదాస్పద కామెంట్లు చేస్తుంటుంది. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే నటించిన `గెహ్రాయిన్` సినిమా పోర్న్ మూవీలా ఉందని కంగన కొన్ని రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మరోసారి స్పందించింది. స్కిన్ షో, వల్గారిటీ, రొమాన్స్.. వంటివి ఏ సినిమానూ కాపాడలేవని రాసుకొచ్చింది. అంతకుముందు కూడా దీపికపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Recommended Video

కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించారన్న కంగన
బాలీవుడ్ నటి, నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న రియాల్టీ షో `లాక్ అప్`కి కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఆ కార్యక్రమం సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన తన కెరీర్ తొలి రోజుల గురించి మాట్లాడింది. `ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అందరూ నన్ను ఏడిపించేవారు. కొండ ప్రాంతాల నుంచి వచ్చానని, ఇంగ్లీష్ అస్సలు రాదని అవహేళన చేసేవారు. ఇంకా కొందరైతే ఇండస్ట్రీ నీ లాంటి వారి కోసం కాదు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని ముఖంపైనే చెప్పేవారు. అలాంటి సమయంలో ఏక్తా నాకు మద్దతుగా నిలిచింద`ని కంగన చెప్పింది.


Click it and Unblock the Notifications











