twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగన బండారం బట్టబయలు.. నోటి దురుసుతో ఇరుక్కుపోయిన క్వీన్

    |

    బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలు, శివసేన నేతలకు మధ్య వాగ్వాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో ముంబై పోలీసుల దర్యాప్తును తప్పుపడుతున్న కంగన మహారాష్ట్ర సర్కార్‌పై నిప్పుచెరుగుతున్నది. ఈ క్రమంలో తాజా ఇంటర్య్వూలో కంగన మాట్లాడుతూ గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో శివసేనకు ఓటు వేయాల్సి వచ్చిందనే కామెంట్ చేసింది. అయితే కంగనకు బలవంతంగా ఓటు వేయాల్సిన పరిస్థితులు లేవని స్థానిక, జాతీయ మీడియా ఆమె‌కు వ్యతిరేకంగా కథనాన్ని వెలువరించింది. ఈ తాజా వివాదంలోకి వెళితే..

    బాంద్రా వెస్ట్ ఓటరుగా

    బాంద్రా వెస్ట్ ఓటరుగా

    సినీ నటి కంగన రనౌత్‌కు ముంబైలోని బాంద్రా పశ్చిమ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ, ఆ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఈ నియోజకవర్గం ముంబై ఉత్తర సెంట్రల్ పరిధిలోకి వస్తుంది.

     గత్యంతరం లేని పరిస్థితుల్లో

    గత్యంతరం లేని పరిస్థితుల్లో

    బాంద్రా పశ్చిమ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకొన్న కంగన రనౌత్ 2019 ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసినందున బీజేపీకి బదులు శివసేనకు ఓటు వేయాల్సి వచ్చింది అని ఇంటర్వ్యూలో చెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాను బీజేపీకి ఓటు వేయాలేకపోయాను అని వెల్లడించింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీకి కంగన ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికీ ఓటు వేయలేదు అని జాతీయ చానెల్ తన కథనంలో పేర్కొన్నది.

    కంగన రనౌత్ వ్యాఖ్యలు తప్పు

    కంగన రనౌత్ వ్యాఖ్యలు తప్పు

    2019లో ముంబై ఉత్తర సెంట్రల్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పూనమ్ మహాజన్ పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి ప్రియాదత్ పోటీచేశారు. ఆ సమయంలో శివసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు చేసుకొని కలిసి పోటీ చేశాయి. ఆ సమయంలో తాను శివసేనకు బలవంతంగా ఓటు వేయాల్సి వచ్చిందని కంగన చేసిన కామెంట్ తప్పు అని ముంబై తక్ తన కథంలో పేర్కొన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    జైలుకు పంపుతానని.. యూటర్న్

    జైలుకు పంపుతానని.. యూటర్న్

    ముంబై తక్ కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత సదరు రిపోర్టర్‌పై లీగల్ యాక్షన్ తీసుకొంటానని ట్వీట్ చేసి కంగన బెదిరించింది. తప్పుడు సమాచారం ప్రసారం చేయకు. నీవు దానిని రుజువు చేయలేకపోతే దారుణమైన ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. తప్పుడు ప్రచారం చేసినందుకు జైలుకు పంపుతాను అని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నది. ఆ తర్వాత ముంబై తక్ ప్రచురించిన కథనం వాస్తవమని తేలడంతో కంగన తన ట్వీట్‌ను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.

    English summary
    Bollywood actress Kangana Ranaut deletes her tweet after wrong claim on Vote for Shiv sena. He said, I voted for Shiv Sena in 2019 in unavoidable circumstances. But Mumbai Tak proved that she had option to vote BJP instead of Shiv Sena.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X