twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియా పేరును భారత్‌గా మార్చాలి.. ఆ బానిసత్వం మనకొద్దు.. కంగన రనౌత్ డిమాండ్

    |

    బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చాలంటే తన పోస్టులో పేర్కొన్నారు. తన పోస్టులో కంగన స్పందిస్తూ... ప్రాచీన అధ్యాత్మికత, మేధస్సు ద్వారానే ఇండియా వృద్ది పథంలో ప్రయాణిస్తున్నాను. అందుకే ప్రాచీన మూలాలే కారణం. వేదాలు, గీత, యోగా లాంటి మూలాలపై ప్రపంచం దృష్టి సారించింది. నాగరికత పేరుతో పట్టణాల్లో పాశ్చత్య ధోరణలు పెరిగిపోతున్నాయి. అలాంటి వాటికి చెక్ పెడితే భారత్ ప్రపంచాన్ని శాసించే లీడర్‌గా ఎదుగుతుందనే అభిప్రాయం కలుగుతున్నది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియా పేరును తిరిగి భారత్ అని మార్చాలన్నది నా అభిప్రాయం. బ్రిటీష్ వాళ్లు ఇచ్చిన బానిస్వత్వంగా ఇచ్చిన ఇండియా పేరును భారత్‌గా మార్చాల్సిందే అని కంగన రనౌత్ కూ యాప్‌లో పేర్కొన్నారు.

    కంగన తన పోస్టులో మరిన్ని వివరాలు ఇస్తూ. ఇండియా అనేది బ్రిటీష్ ఇచ్చిన బానిస పేరు. దాని అర్ధం తూర్పులో ఉండే హిందూ రివర్. దాని సీ సెక్షన్ ద్వరా జన్మించిన అంగవైకల్యం కలిగిన శిశువు మాదిరిగా ఉందా ఆ పేరు. అసలు భారత్ అంటే అసలు అర్ధమేమిటో నేను చెబుతాను. భా అంటే భావం.. ర అంటే రాగం.. త్ అంటే తాళం అని కొత్త అర్ధం చెప్పింది. మనలో భావుకత్వం అంది. మన భాష, సంస్కతి, నాగరికతను ధ్వంసం చేసింది. అందులో భాగంగానే మన ప్రాంతాల పేర్లను కూడా మార్చేసింది. వారసత్వ కట్టడాల పేర్లను కూడా మార్చేసి మన అస్థిత్వాన్ని కూలదోసింది. భారత్ పేరుతో మన మూలాలను, మన ప్రతిష్టను తిరిగి పొందాలి అంటూ సుదీర్ఘమైన లేఖను కంగన రాశారు.

    Kangana Ranaut demands name change from India to Bharat

    అయితే కంగన రనౌత్ పోస్టుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కంగన చెప్పినట్టు బానిసత్వంగా వచ్చిన ఇండియా పేరును మార్చాల్సిందే. కానీ బ్రిటీష్ కంటే ముందు ఇండియా లేదా భారత్ అనేది లేదనే విషయాన్ని ఆమెకు ఎవరు చెప్పాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

    కంగన కెరీర్ విషయానికి వస్తే... జయలలిత జీవిత కథలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ ఇచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. అంతేకాకుండా ధాకడ్, తేజాస్, మణికర్ణిక రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    Bollywood actress Kangana Ranaut demands name change from India to Bharat. She wrote in Koo App that, India can only rise if it’s rooted in its ancient spirituality and wisdom, that is the soul of our great civilisation. The world will look up to us and we will emerge as a world leader if we go higher in urban growth but not be a cheap copy of the western world and remain deeply rooted in Vedas, Geeta and Yoga, can we please change this slave name India back to Bharat?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X