twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూల్చిన బిల్డింగ్ శరద్ పవార్‌ది.. వాళ్లే జవాబు చెప్పాలి.. తెరపైకి కంగన రనౌత్ సరికొత్త వాదన

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో జరుగుతున్న దర్యాప్తు విషయంలో శివసేన, బాలీవుడ్ నటి కంగన రనౌత్ మధ్య రాజుకొన్న వివాదం కొత్త మలుపులు తిరుగుతున్నది. కంగన రనౌత్ ఇంటి కూల్చివేత అంశంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ఇంటి కట్టడానికి సంబంధించిన విషయాలను ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో విజృంభిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    కోర్టు స్టేతో కూల్చివేతకు బ్రేక్

    కోర్టు స్టేతో కూల్చివేతకు బ్రేక్

    అక్రమ కట్టడం అనే సాకును చూపి బుధవారం మధ్యాహ్నం కంగన రనౌత్ ఇంటిని నేలమట్టం చేసేందుకు బుల్‌డోజర్లతో భారీ ఎత్తున్న బృహన్ బొంబాయి మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది సిద్ధమయ్యారు. మనాలి నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ కార్యక్రమానికి అధికారులు తెర తీశారు. అయితే కోర్టు స్టే కారణంగా కూల్చివేత పనులకు బ్రేక్ పడింది.

    కరణ్ జోహర్ గ్యాంగ్‌పై

    కరణ్ జోహర్ గ్యాంగ్‌పై

    కంగన ముంబైకి చేరుకొన్న తర్వాత తనపై ప్రతీకార దాడికి పాల్పడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం, కరణ్ జోహర్ గ్యాంగ్‌పై విరుచుకుపడ్డారు. ఇప్పడు నా ఇంటిని ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం కూల్చివేసింది. ఇక కరణ్ జోహర్ గ్యాంగ్ నా ముఖాన్ని, దేహాన్ని నుజ్జు చేయడమే మిగిలి ఉంది. ఆ పని కూడా కానిచ్చేయండి. నేను బతికి ఉంటానా.. మరణిస్తానా? అనేది పక్కన పెడితే మీ బండారం బయటపెట్టకుండా ఉండను అని కంగన రనౌత్ అన్నారు.

    శరద్ పవార్, పార్ట్‌నర్ నుంచి కొన్నాను

    శరద్ పవార్, పార్ట్‌నర్ నుంచి కొన్నాను

    ఇంటి కూల్చివేత అంశం నాకు సంబంధించినది కాదు. నా ఒక్క ఫ్లాట్‌కు సంబంధించిన సమస్య కాదు. అక్రమ కట్టడం అనేది బిల్డింగ్‌ మొత్తానికి సంబంధించిన వివాదం. బిల్డర్‌ ఈ వివాదానికి పరిష్కారం చూపాలి. ఈ బిల్డింగ్ శరద్ పవార్‌ది. ఆయన పార్ట్‌నర్‌ నుంచి కొన్నాం. అక్రమంగా కట్టారనే వివాదానికి ఆయన జవాబు చెప్పాలి. నన్ను, నా ఇంటిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది వాళ్లే చెప్పాలి అని కంగన ట్వీట్ చేశారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    శరద్ పవర్ స్పందన

    శరద్ పవర్ స్పందన

    ఇదిలా ఉండగా, కంగన రనౌత్ ఇంటి వివాదం గురించి శరద్ పవార్ స్పందిస్తూ.. ఆమె ఇంటి గురించి పూర్తి సమాచారం నాకు తెలియదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు పేపర్లో తెలుసుకొన్నాను. ముంబైలో అక్రమ కట్టడాలు సర్వసాధారణం. అయితే నిబంధనలకు అనుగుణంగా బీఎంసీ వ్యవహరిస్తే అది సరైనదే అంటూ శరద్ పవర్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    English summary
    Kangana Ranaut Fires on Maha government and Karan Johar Gang: She tweets, Come Udhav Thakeray and Karan Johar Gang you broke my work place come now break my house then break my face and body, I want world to see clearly what you anyway do underhand, whether I live or die I will expose you regardless
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X