Kangana Ranaut: ఒక్కసారిగా చతికిల పడ్డ కాంట్రవర్సీ క్వీన్ మార్కెట్.. ధాకడ్ కోలుకోలేని దెబ్బ
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనారనౌత్ ఏం మాట్లాడినా కూడా చాలా ఓపెన్ గా మాట్లాడేస్తుంది అని నిన్న మొన్నటి వరకు చాలా మంది ప్రశంసలు కురిపించారు. అయితే ఆమె ఆ ధైర్యంతోనే ఒకవైపు రాజకీయంగానే కాకుండా మరొకవైపు అగ్రహీరోలపై కూడా ఊహించని విధంగా విమర్శలు చేసుకుంటూ వచ్చింది. అయితే కంగనా తనకు ఎవరూ సాటి లేరు అనే విధంగా కూడా ప్రవర్తించినట్లు అనిపించింది. అయితే ఇటీవల వచ్చిన ధాకడ్ సినిమా ఆమె మార్కెట్ ను అయితే ఒక్కసారిగా డౌన్ అయ్యేలా చేసింది. ఇక ఆ సినిమా ఏ స్థాయిలో నష్టాలను కలిగించేలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

డేరింగ్ కంగనా..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కంగనా రనౌత్ కొంత కాలం తర్వాత స్టార్ హీరోలతో దర్శకులతో కూడా ఆమె గొడవలు పెట్టుకుంది. ఒక విధంగా పురుషాధిపత్యం ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది అని ఆమె కొంతమందిని గట్టిగానే ఎదిరించింది. అప్పుడు మరికొందరు ఆమె మాటలకు మద్దతు కూడా పలికారు. హృతిక్ రోషన్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి కలిగించాయి.

దర్శకులతో గొడవలు
వివాదాలు కంగనాకు కొత్తేమి కాదు. ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై అలాగే హీరోల డామినేషన్ పై ఇంకా నెపోటీజమ్ పై కూడా స్పందించిన విధానం అందరిని ఆకట్టుకుంది. ఆయితే ఆమె మాటలు కొన్నిసార్లు హద్దులు దాటినట్లు కూడా కామెంట్స్ వచ్చాయి. అది కూడా కంగనా మార్కెట్ డౌన్ అవ్వడానికి ఒక కారణం అయ్యి ఉండవచ్చని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. షూటింగ్స్ లో కూడా ఆమె దర్శకులతో కొన్నిసార్లు గొడవకు దిగింది. మనికర్ణిక షూటింగ్ చివరలో క్రిష్ ఆమె కారణంగా కూడా తప్పుకోవాల్సి వచ్చింది.

ఒకప్పుడు 100కోట్ల సినిమా
కంగనా రనౌత్ మనికర్ణిక సినిమా కంటే ముందు ఆ తరువాత అనేలా తన కెరీర్ లో ఊహించని డిజాస్టర్స్ ను చూస్తోంది. ఎలాంటి సినిమాలు చేసినా కూడా వరుసగా డిజాస్టర్ అవుతున్నాయి. ఒకప్పుడు క్వీన్ సినిమాతో 100కోట్ల కలెక్షన్స్ అందుకొని బాలీవుడ్ బడా హీరోలకు ధీటుగా నిలబడింది. అనంతరం తను వెడ్స్ మను కూడా మంచి విజయాన్ని సాధించింది.

దారుణంగా..
ఇక మనికర్ణిక సినిమా అనంతరం జడ్జిమెంటల్ హై క్యా, పంగా, తలైవి, దారుణంగా దెబ్బ కొట్టాయి. ముఖ్యంగా తలైవి సినిమా అయితే ఫుల్ రన్ లో కేవలం 3కోట్లను మాత్రమే అందుకుంది. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసినప్పటికీ కనీసం రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకు రాలేదు.

ధాకడ్ నుంచి మరో దెబ్బ!
ఇక ఇప్పుడు ధాకడ్ సినిమా అయితే మరో భారీ దెబ్బ కొట్టింది. హిందీ ఆడియెన్స్ టెస్ట్ కు తగ్గట్లుగా ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చారు. సినిమాకు దాదాపు 100కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్ వస్తోంది. కానీ బాక్సాఫీస్ వద్ద సినిమాకు కనీసం 5కోట్లు కూడా రాలేదని సమాచారం. అంటే సినిమా ఏ రేంజ్ లో నష్టాల బారిన పడిందో అర్థం చేసుకోవచ్చు. మరి తదుపరి సినిమాల విషయంలో కంగనా ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











