రియాకు, మహేష్ భట్ మధ్య ఆ బంధం.. సుశాంత్ మరణానికి ముందు అక్కడి నుంచి జంప్.. కంగన సంచలన ట్వీట్
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దాఖలైన కేసు దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలు మంగళవారం చోటుచేసుకొన్నాయి. ఊహించని విధంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆయన కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయడం సంచలనం రేపుతున్నది. ఈ క్రమంలో రియా, మహేష్ భట్ సంబందాలపైపై కంగన రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగన చేసిన ట్వీట్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్ మాఫియా కారణంగానే
సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ మాఫియా కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నదని బహిరంగంగా కంగన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సుశాంత్ సింగ్ అంగీకరింంచిన ఆరు సినిమాలు చేతి నుంచి జారిపోయాయి. అందుకు కారణం కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్, రాజీవ్ మసంద్ అని ఆరోపణలు చేశారు. ఈ మేరకు కంగన ఓ వీడియోను కూడా రిలీజ్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

సూసైడ్ గ్యాంగ్ వల్లనే సుశాంత్ సింగ్ మరణం
ఇక సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్‌లో ప్రతీ రోజు ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఈ క్రమంలో రిపబ్లిక్ టెలివిజన్ ఈ అంశంపై చర్చను చేపట్టింది. అర్నబ్ గోస్వామి చర్చలో భాగంగా కంగన రనౌత్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో సూసైడ్ గ్యాంగ్ కారణంగానే సుశాంత్ మరణం చోటుచేసుకొన్నదనే ఆరోపణలను మరోసారి సంధించింది.

రియా చక్రవర్తి, మహేష్ బంధంపై
ముంబై పోలీసుల 43 రోజుల దర్యాప్తు కొనసాగుతుండగా పాట్నాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తిపై కేసు నమోదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కంగన రనౌత్ స్పందించారు. రియా, మహేష్ సంబంధాలపై ఘాటుగా ట్వీట్ చేశారు.

రియా, మహేష్ భట్‌పై కంగన అనుమానం
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కంగన రనౌత్ ట్వీట్ చేస్తూ. సుశాంత్ సింగ్ మరణానికి ముందు ఆరు నెలలపాటు రియా చక్రవర్తి అతడితోనే ఉంది. సుశాంత్‌కు సైక్రియాటిస్ట్‌గా మహేష్ భట్‌ను రియా చక్రవర్తి నియమించింది. అయితే సుశాంత్ మరణానికి ముందు వారంతా దుకాణం సర్దేశారు. అక్కడి నుంచి కనిపించకుండా పోయారు. గత ఆరు నెలల కాలంలో జరిగిన ఆ గుట్టును విప్పడానికి ఇప్పుడు వారందరిని విచారించాల్సిందే అని కంగన ట్వీట్ చేశారు.

ముంబైకి చేరుకొన్న బీహార్ పోలీసుల బృందం
సుశాంత్ సింగ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ తర్వాత బీహార్ నుంచి నలుగురు పోలీసులతో కూడిన బృందం ముంబైకి చేరుకొన్నది. ఈ కేసును పాట్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారి దర్యాప్తు కూడా గుట్టుగా చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

45 మందిని విచారించిన పోలీసులు
జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ మరణం తర్వాత ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటి వరకు భన్సాలీ, ఆదిత్య చోప్రా, ముఖేష్ చాబ్రా, పితాని, రియా చక్రవర్తి, మహేష్ భట్‌తోపాటు 45 మందిని విచారించారు. పలు విభాగాల నుంచి వచ్చిన పోస్టు మార్టం రిపోర్టులను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తును ముందుకు సాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











