చంపేస్తాం అంటున్నారు.. అయినా భయపడను.. సోనియా గాంధీకి కంగనా మెస్సేజ్!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రస్తుతం కంగనా రనౌత్ పేరు అయితే దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఆమె వివిధ రకాల సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తోంది. అంతేకాకుండా రాజకీయ పార్టీలతో కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కంగనా గతంలో ఎప్పుడూ లేని విధంగా కొంతమంది రాజకీయ నాయకులను ప్రశంసిస్తూనే మరి కొంతమందిని అనేక రకాల విషయాలపై ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా తప్పు జరిగినప్పుడు కూడా ఆమె గట్టిగా నిలదీస్తుంది. అయితే ఇటీవల ఆమెను చంపేస్తాను అంటూ కొందరు రాజకీయ నాయకుల బెదిరిస్తున్నారు అంటూ వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాంట్రవర్సీ సినిమాలు

కాంట్రవర్సీ సినిమాలు


ఎంతో కష్టపడి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కంగనా రనౌత్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అయితే అందుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆమె చేస్తున్న సినిమాలు కూడా ఏదో ఒక విషయంలో కాంట్రవర్సి గా మారుతున్నాయి. అయినప్పటికీ కూడా కంగనారనౌత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తను అనుకున్న సినిమాలను వివాదంలోనే పూర్తి చేస్తోంది.

 కౌంటర్ ఇస్తున్న కంగనా

కౌంటర్ ఇస్తున్న కంగనా


ఇక ఇటీవల కంగనారనౌత్ పంజాబ్ రాజకీయాలపై కూడా తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఎదిరించిన వారికి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కంగనా రనౌత్ ఎలాంటి కామెంట్స్ చేసిన కూడా సోషల్ మీడియాలో ఈజీగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆమెకు మద్దతు ఇచ్చేవారు కూడా చాలామంది ఉన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆమెకు కొంత మందిపై డైరెక్టుగానే హెచ్చరికలు పంపిస్తూ ఉండడం విశేషం.

 చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నారు

చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నారు

అయితే సాగు చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న పోరాటంపై తనదైన శైలిలో స్పందించిన కంగనా రనౌత్ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఆ విషయంలో తను ఏమాత్రం తగ్గను అని తెలిపింది. మంచి విషయం పై తను ఎప్పటికీ మద్దతు ఇస్తూనే ఉంటానని అని వివరణ ఇచ్చింది. అయితే తన అభిప్రాయాలను కొందరు వ్యతిరేకించడమే కాకుండా చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నారు అని తెలిపిన కంగనారనౌత్ అలాంటి బెదిరింపులకు తాను వెనక్కి తగ్గే మనిషిని కాదు అని కౌంటర్ ఇచ్చారు.

 ఎఫ్ఐఆర్ నమోదు

ఎఫ్ఐఆర్ నమోదు


బెదిరింపులు రావడంతో కంగనా రనౌత్ పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాబ్ కు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానంటూ భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అని కంగనా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందుకు సంబంధించిన వివరాలను కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

Recommended Video

Kangana Ranaut బోల్డ్ పోస్ట్... అరెస్టు చెయ్యడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుంది...! | Filmibeat Telugu
సోనియాగాంధీ చర్యలు తీసుకోవాలి

సోనియాగాంధీ చర్యలు తీసుకోవాలి

ఎవరైతే దేశానికి ద్రోహం చేయాలని అనుకుంటున్నారో.. వారు ఎంత బలవంతులైన సరే వ్యతిరేకంగా మాట్లాడతాను. అంతేకాకుండా భారత జవాన్లను చంపాలనుకునే నక్సలైట్లను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాను అంటూ ఉగ్రవాదులను సైతం తప్పుబడతాను అని వివరణ ఇచ్చారు. ఇక పంజాబ్ లోని ఒక వ్యక్తి నన్ను చంపేస్తాను అని బహిరంగంగా చెప్పాడు. అయితే ఈ విషయంపై సోనియాగాంధీ చర్యలు తీసుకోవాలి అని మీ అత్తగారు ఇందిరాగాంధీ కూడా ఉగ్రవాదులపై ఆఖరి వరకు కూడా పోరాడారని గుర్తు చేశారు. బెదిరింపు చర్యలకు పాల్పడిన వారిపై పంజాబ్ లోనీ మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సూచించాలి అని కూడా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X