For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాపై కేసు కక్ష పూరితం.. ఎఫ్ఐఆర్ కొట్టివేయండి.. కంగన, రంగోలి పిటిషన్

  |

  కంగన రనౌత్, తనపై ముంబై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని రంగోలి చండేల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. మత సామరస్యతను దెబ్బ తీస్తున్నారంటూ కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ బహిష్కరణ ఆరోపణలపై వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  తమపై దాఖలు చేసిన పిటిషన్‌ కక్షపూరితం, కాబట్టి దానిని తోసిపుచ్చాలంటూ కంగన రనౌత్, రంగోలి చండేల్ పిటిషన్ దాఖలు చేశారు అని వారి తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి తెలిపారు. పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని, అలాగే వారిని విచారించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

   Kangana Ranaut files petition in Bombay High Court for quashing of the FIR

  ఇదిల ఉండగా, 23. 24 తేదీలలో కంగన, రంగోలిని విచారణకు హాజరుకావాలని సమన్లు దాఖలు చేశారు. ఇలా వారికి సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. కంగన రనౌత్, రంగోలి చండేల్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 295 ఏ, 124 ఏ, 34 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  English summary
  Bollywood Actress Kangana Ranaut and Rangoli Chandel files petition in Bombay High Court for quashing of the FIR which filed by Mumbai police. As per reports, Mumbai Police for allegedly “trying to create hatred and communal tension” through their posts on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X