twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరణ్ జోహర్‌పై విరుచుకుపడ్డ కంగన రనౌత్.. సోషల్ మీడియాలో మాటల దాడి!

    |

    బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి తన విశ్వరూపాన్ని సోషల్ మీడియాలో చూపించారు. తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా తలైవి తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన తలైవి ట్రైలర్‌కు అనూహ్యమైన దేశవ్యాప్తంగా రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో జాతీయ మీడియాతో కంగన మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కంగన చెప్పిన విషయాలు ఏమిటంటే...

    జాతీయ అవార్డు, తలైవి ట్రైలర్

    జాతీయ అవార్డు, తలైవి ట్రైలర్

    కంగన కెరీర్ విషయానికి వస్తే ఆమె గ్రాఫ్ రివ్వును పైకి ఎగిసిపోతున్నది. ఇటీవల తలైవి మూవీ ట్రైలర్ రిలీజై అన్ని వర్గాలను ఆకట్టుకోవడం, అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవడంతో కంగన ప్రభ మరోసారి నేషనల్ లెవెల్‌‌లో వెలిగిపోయింది.

    జయలలిత తర్వాత కంగన రనౌత్‌తో

    జయలలిత తర్వాత కంగన రనౌత్‌తో

    ఈ పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ నటి, హోస్ట్ సిమి గరేవాల్‌ తన షో రెండెజ్‌వస్ విత్ సిమి గారేవాల్ కోసం కంగనను ఆహ్వానించారు. గతంలో మాజీ సీఎం జయలలితను కూడా సిమి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పట్లో ఆ ఇంటర్యూ వైరల్ కూడా అయింది. ఆ సమయంలో సిమిని జయ ప్రశంసలతో ముంచెత్తారు.

    కరణ్ జోహర్‌పై వ్యంగ్యాస్త్రాలు

    కరణ్ జోహర్‌పై వ్యంగ్యాస్త్రాలు

    తాజాగా జయలలిత పాత్రను పోషించిన కంగన రనౌత్‌ను సిమి గరేవాల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఓ నటిలోని అంతర్గత విషయాలను సిమి బయటకు తీసిన విధానాన్ని కంగన ప్రశంసించారు. అందే సమయంలో కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోపై సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు.

    సిమీ గరేవాల్ భేష్...

    సిమీ గరేవాల్ భేష్...

    ఓ సెలబ్రిటీలోని వాస్తవ విషయాలను తీసుకోవడం, బయటికి చెప్పించేలా చేయడంలో సిమి గరేవాల్ అద్భుతమైన పరిణతిని చూపించారు. కేవలం సబ్జెక్ పరంగానే ప్రశ్నలు సంధించారు. జయ అమ్మ గురించిన పరిశోధన చాలా నాకు దోహదపడింది అని తన ట్వీట్‌లో కంగన పేర్కొన్నారు.

    సెక్స్, గాసిప్స్ అంటూ కరణ్ జోహర్‌పై దాడి

    సెక్స్, గాసిప్స్ అంటూ కరణ్ జోహర్‌పై దాడి

    అయితే కరణ్ జోహర్ గురించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. పాపా జో చేసే ఇంటర్వ్యూలో ఇలాంటి తీరు కనిపించదు. కేవలం నటినటులను దెప్పి పొడవడం, కించపరిచేలా మాట్లాడటం, గాసిప్స్, ప్రస్టేటెడ్ సెక్స్ గురించి నీచంగా మాట్లాడటం చేస్తుంటాడు అంటూ కరణ్ జోహర్‌పై విరుచుకుపడ్డారు.

    English summary
    Bollywood actress Kangana Ranaut fired on Karan Johar in social media. She wrote on the twitter that Yes Simi_Garewaltapped tapped in to real essence of a celebrity, A complete sketch of the subject. Rendezvous with Jayaa maa has helped me a lot in my research, same can’t be said about certain Papa Jo whose interviews are all about bitching, bullying, gossip and frustrated sex
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X