హీరోలు వాళ్ళ భార్యలతో అలా, హీరోయిన్లతో ఇలా.. స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్!

Recommended Video

Kangana Ranaut Talks About #Metoo

బాలీవుడ్‌లో లైంగిక వేధింపుల వివాదం మరింత రచ్చగా మారుతోంది. పరస్పర విమర్శలు ఎక్కువవుతున్నాయి. నటీమణులంతా మీటూ ఉద్యమం ద్వారా తమకు జరిగిన లైగింక వేధింపులని బయటపెడుతున్నారు. తనుశ్రీ దత్తతో మొదలైన ఈ ఉద్యమం బాలీవుడ్ ని కుదిపేస్తోంది. కొందరు దర్శకులు, నటుల కెరీర్ సందిగ్ధంలో పడింది. మీటూ ఉద్యమానికి ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మద్దత్తు లభిస్తోంది. ఇటీవల బాలీవడ్ దర్శకుడు వికాస్ బహల్ పై సంచలన ఆరోపణలు చేసిన కంగనా రనౌత్ మరో మారు మీటూ గురించి స్పందించింది.

మహిళా సిబ్బంది

మహిళా సిబ్బంది

క్వీన్ చిత్రానికి పనిచేసిన ఓ మహిళ వికాస్ బహల్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వికాస్ తనని లైంగికంగా వేధించాడని పేర్కొంది. దీనితో కంగనా రనౌత్ కూడా నోరు తెరిచి మరింత దుమారం రేపింది. వికాస్ తరచుగా లైంగికంగా వేధిస్తుంటాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనితో బాలీవుడ్‌లో వికాస్‌కు వత్తిడి పెరిగింది.

సినిమాల నుంచి తొలగింపు

సినిమాల నుంచి తొలగింపు

దీనితో వికాస్ పనిచేస్తున్న పలు చిత్రాల నుంచి అతడిని తొలగించారు. ఫాంటమ్ ప్రొడక్షన్స్ లో వికాస్ ఓ నిర్మాతగా కూడా ఉన్నాడు. ఆ సంస్థ నుంచి కూడా అతడు తప్పుకోవాల్సి వచ్చింది. 83 సినిమా నుంచి కూడా వైదొలిగాడు.

నేను చెప్పిందంతా నిజం

నేను చెప్పిందంతా నిజం

వికాస్ గురించి వస్తున్న వార్తలు, అతడి లైంగిక వేధింపుల గురించి తాను చెప్పిన విషయాలన్నీ వాస్తవం అని కంగనా రనౌత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. వికాస్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లంతా పెద్ద మనుషుల ముసుగులో దాక్కుని ఉన్నారంటూ కంగనా పేర్కొంది.

వాళ్ళ భార్యలని అలా

వాళ్ళ భార్యలని అలా

కంగనా మరో సంచలన వ్యాఖ్య కూడా చేసింది. ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళ భార్యలని మాత్రం ఇంట్లో భద్రంగా చూసుకుంటారు. వారితో కలసి పనిచేసే హీరోయిన్లు, మహిళలతో మాత్రం నీచంగా ప్రవర్తిస్తారు అని కంగనా తెలిపింది.

హృతిక్‌పై ఘాటుగా

హృతిక్‌పై ఘాటుగా

ఇప్పటికే హృతిక్, కంగనా మధ్య వివాదం చిరిగి చాటంత అయింది. మరో మారు హృతిక్ రోషన్ పై కంగనా రనౌత్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హృతిక్ రోషన్ తో ఎవరూ కలసి పనిచేయకూడదు. అతడి గురించి నన్ను అడిగితే ఇలాగే చెబుతాను అని కంగన తెలిపింది. క్రిష్ 3 సమయంలో తాను, హ్రితిక్ కలసి ఘాటైన ప్రేమలో మునిగితేలామని కంగన తెలిపింది. తన పరువు తీసేందుకే కంగనా అసత్య ఆరోపణలు చేస్తోందని హృతిక్ రోషన్ అప్పట్లో ఖండించాడు.

 కఠినంగా శిక్షించాలి

కఠినంగా శిక్షించాలి

ఇదిలా ఉండగా వికాస్ దర్శత్వంలో హృతిక్ ప్రస్తుతం సూపర్ 30 చిత్రంలో నటిస్తున్నాడు. అతడిపై ఆరోపణలు రావడంతో హృతిక్ రోషన్ స్పందించాడు. నిర్మాతలు కఠిన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఆరోపణలు రుజువైతే కఠినంగా శిక్షించాలి అని పేర్కొన్నాడు. మీటూ ఉద్యమంతో బాలీవుడ్ లో పలు చిత్రాలు సందిగ్ధంలో పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X