ప్రభాస్ అంత పెద్ద స్టార్ కాదు.. మణికర్ణికకు నేనే డైరెక్టర్.. కంగనా రనౌత్!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒంటరిగా వివాదాలతో పోరాడుతోనే నటిగా అద్భుత విజయాలు అందుకుంటోంది. తన గురించి ఎవరేమనుకున్నా విలక్షణ పాత్రలతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్ ఓ ఫైర్ బ్రాండ్. కంగనా రనౌత్ త్వరలో మరోమారు తెలుగు ప్రేక్షకులని పలకరించబోతోంది. కంగనా నటించిన ఏకైక తెలుగు చిత్రం ఏక్ నిరంజన్. ఈచిత్రంలో కంగనా రనౌత్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. జనవరిలో మణికర్ణికగా ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత గాధతో కంగనా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతోంది.

ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో
ఝాన్సీ లక్ష్మి బాయి పాత్రలో కంగనా నటిస్తున్న మణికర్ణిక చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటగా ఈ చిత్రాన్ని క్రిష్ దర్సత్వంలో ప్రారంభించారు. కానీ అనుకోని పరిస్థితుల మధ్య క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనితో కొంతభాగం దర్శకుడు లేకుండానే షూటింగ్ చేయవలసి వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ లో ఎదురైన ఇబ్బందులని కంగనా రనౌత్ వివరించింది.

నేనే డైరెక్ట్ చేశా
మణికర్ణిక చాలా భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రం. త్వరగా షూటింగ్ పూర్తి చేయడానికి రెండు యూనిట్స్ గా చిత్రీకరణ జరిపాం. ఓ యూనిట్ లో డ్రామా, మరో యూనిట్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాం అని కంగన తెలిపింది. డ్రామా పార్ట్ కి తానే దర్శకత్వం వహించానని తెలిపింది. ఆ సన్నివేశాలు పూర్తి కాగానే వెంటనే వెళ్లి యాక్షన్ సీన్స్ లో నటించాలి. అలా షూటింగ్ మొత్తం చాలా ఒత్తిడిలో పనిచేశాం అని కంగనా తెలిపింది.

మీడియాలో నెగిటివ్
మరోవైపు మణికర్ణిక చిత్రం గురించి మీడియాలో కూడా నెగిటివ్ ప్రచారం మొదలైంది. సినిమా చిత్రీకరణ దశలో ఉన్నపుడే ఊహించని ఘటనలు ఎదురయ్యాయి. దీనితో పెద్దఎత్తున నెగిటివ్ గా ప్రచారం జరిగింది. దీనిని ఛాలెంజింగ్ గా తీసుకుని సినిమాని పూర్తి చేశాం అని కంగనా రనౌత్ తెలిపింది. తాను గాయాలపాలవడం మరో సమస్య అని కంగనా తెలిపింది. జోధ్ పూర్ జరిగిన షూటింగ్ లో యాక్షన్ సీన్లో భాగంగా కాలికి గాయమైన విషయాన్ని కంగనా గుర్తుచేసుకుంది.

ప్రభాస్ అంత పెద్ద స్టార్ కాదు
ఇక తెలుగులో తనకు నచ్చిన హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ అని తెలిపింది. ప్రభాస్ తో ఇది వరకే ఏక్ నిరంజన్ చిత్రంలో నటించా. అప్పుడు ప్రభాస్ అంత పెద్ద స్టార్ కాదు. షూటింగ్ సమయంలో మేమిద్దరం చాలా సరదా ఉండేవాళ్ళం అని కంగనా తెలిపింది. ప్రభాస్ తో కలసి డ్యూయెల్ రోల్ లో నటించే సినిమా చేయాలని ఉందని కంగనా తెలిపింది. మణికర్ణిక చిత్రం జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











