twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఊర్మిళపై కామెంట్స్‌.. సోషల్ మీడియాలో కంగనాకు ఎదురు దెబ్బ

    |

    గత కొన్ని రోజులుగా డ్రగ్స్ భూతం బాలీవుడ్‌ను పట్టి కుదిపేస్తోంది. ఇక ఇది పొలిటికల్‌గానూ బాగా వైరల్ అయింది. డ్రగ్స్ కేసు విషయమై నటుడు, ఎంపీ రవికిషన్ మాట్లాడిన మాటలు వైరల అయ్యాయి. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంటుందని, ఎన్‌సీబీ అధికారులు బాగా పనిచేస్తున్నారని రవికిషన్ పేర్కొన్నాడు. వాటిపై రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ మాట్లాడుతూ.. వాటిని ఖండించింది. ఇలా ఈ వ్యవహారం ముదురుతూ కంగన రనౌత్ ఊర్మిళా మటోండ్కర్ మధ్య చిచ్చును పెట్టింది.

    బాలీవుడ్‌లోని 90 శాతం మంది ప్రముఖులకు డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయని, సరైన టెస్టులు చేస్తే అగ్ర నటులంతా జైల్లోనే ఉంటారు అని కంగన రనౌత్ వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కంగన లాంటి వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేయకూడని, బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీయవద్దు అంటూ ఊర్మిళ స్పందించింది. ఇక ఊర్మిళ హితబోధపై కంగనా మండిపడింది.

    Kangana Ranaut Is Trolled For Comments On Urmila Matondkar

    ఊర్మిళ వ్యాఖ్యలపై కంగన స్పందిస్తూ.. నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. నేను బీజేపీ టికెట్ కోసం ఆశిస్తున్నానని ఆరోపణలు చేశారు. ఓ పోర్న్‌స్టార్ టికెట్ సాధించగలిగితే.. మరాఠా సంస్కృతిని చాటేలా సినిమాలు తీసిన నాకు టికెట్ ఇవ్వరా అంటూ కంగన ఘాటుగా స్పందించారు. అయితే ఇక్కడ ఊర్మిళను అలాంటి దూషించడంతో కంగనాకు పెద్ద దెబ్బ తగిలినట్టైంది. ఇన్నాళ్లు కంగనాకు మద్దతు తెలిపిన నెటిజన్లే నేడు తిట్టిపోస్తున్నారు. కష్టకాలంలో ఒకలా, ఇంకో సందర్భంలో మరోలా మాట్లాడుతుందని కంగనాపై ట్రోలింగ్ చేస్తున్నారు.

    English summary
    Kangana Ranaut Is Trolled For Comments On Urmila Matondkar, Kangana On odd days- I introduced feminism in film industry.Kangana On even days- Urmila Matondkar is known for soft porn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X