Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యోగా సాధనలో తలమునకలైన తలైవి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో ఇప్పుడు అందరి దృష్టి కంగన రనౌత్ నటిస్తున్న'తలైవి'పైనే నిలిచింది. 2019 నవంబర్‌లో 'తలైవి' ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటిస్తున్నారు. ఇక కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి.
అయితే కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా మరో షెడ్యూల్ ఇటీవలే మొదలైయింది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్‌కు వచ్చేసింది. అయితే ఈ మూవీకి ఒప్పుకున్న తరువాత కంగనా చాలా కసరత్తులే చేసింది. ముఖ్యంగా అమ్మ పాత్రలో నటించేందుకు బరువు కూడా పెరిగింది.
అంతకుముందు కాస్త సన్నగా ఉండే కంగనా.. ఈ మూవీ కోసం ఏకంగా 20కేజీల బరువు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ సన్నగా మారి షాక్ ఇచ్చింది. తాజా కంగనా పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యోగా సాధనలో నిమగ్నమైన క్వీన్ స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తోంది అనడంలో సందేహమేలేదు.
ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ పై మిశ్రమ స్పందన లభించడంలో అప్రమత్తమైన టీమ్ తాజాగా మరో లుక్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సన్నజాజిలా మారిన కంగనాను చూసి షాక్ అవుతున్నారు జనాలు. మరి సినిమా అమ్మడు పడుతున్న కష్టానికి ఎలా ఫలితం లభిస్తుందో వేచి చూడాలి.