twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యోగా సాధనలో తలమునకలైన తలైవి

    |

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో ఇప్పుడు అందరి దృష్టి కంగన రనౌత్ నటిస్తున్న'తలైవి'పైనే నిలిచింది. 2019 నవంబర్‌లో 'తలైవి' ఫస్ట్‌లుక్‌ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటిస్తున్నారు. ఇక కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి.

    అయితే కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా మరో షెడ్యూల్‌ ఇటీవలే మొదలైయింది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్‌కు వచ్చేసింది. అయితే ఈ మూవీకి ఒప్పుకున్న తరువాత కంగనా చాలా కసరత్తులే చేసింది. ముఖ్యంగా అమ్మ పాత్రలో నటించేందుకు బరువు కూడా పెరిగింది.

    Kangana Ranaut kills with crazy yoga poses

    అంతకుముందు కాస్త సన్నగా ఉండే కంగనా.. ఈ మూవీ కోసం ఏకంగా 20కేజీల బరువు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ సన్నగా మారి షాక్ ఇచ్చింది. తాజా కంగనా పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యోగా సాధనలో నిమగ్నమైన క్వీన్ స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తోంది అనడంలో సందేహమేలేదు.

    ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ పై మిశ్రమ స్పందన లభించడంలో అప్రమత్తమైన టీమ్ తాజాగా మరో లుక్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సన్నజాజిలా మారిన కంగనాను చూసి షాక్ అవుతున్నారు జనాలు. మరి సినిమా అమ్మడు పడుతున్న కష్టానికి ఎలా ఫలితం లభిస్తుందో వేచి చూడాలి.

    English summary
    Kangana revealed that she has now started the process to lose all the weight that she had gained for her Thalaivi character. the actress is essaying the character of late politician J Jayalalithaa in the biopic drama.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X