»   » వైరల్ పిక్ : కంగన రనౌత్ ముద్దు పెడుతుంటే ఏం నవ్వాడు..ఫిదా అయిపోతారంతే!

వైరల్ పిక్ : కంగన రనౌత్ ముద్దు పెడుతుంటే ఏం నవ్వాడు..ఫిదా అయిపోతారంతే!

Subscribe to Filmibeat Telugu

తనని వివాదాలు చుట్టుముడుతున్నా కంగనా రనౌత్ తట్టుకుని నిలబడి బాలీవుడ్ లో స్టార్ హిరోయిన్ గా ఎదిగింది. కంగన రనౌత్ కంటూ ఇప్పుడు బాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కంగనా రనౌత్ గురించి చిన్న వార్త బయటకు వచ్చినా అది మీడియాలో పెద్ద న్యూస్ అవుతోంది. తాజాగా కంగనా రనౌత్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంగన రనౌత్ సోదరి రంగోలి రనౌత్ గత ఏడాది ముద్దులొలికే బాబుకు జన్మనిచ్చింది. నాలుగు నెలల తన అక్క కొడుకుని చూసుకుని కంగన మురిసిపోతోంది. కంగన తన అక్క కొడుకుని గారాబం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Kangana Ranaut kisses her nephew

కంగన తన సోదరి కొడుకుని చేతుల్లోకి తీసుకుని ముద్ద ఇస్తున్న ఫొటోని రంగోలి రనౌత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కంగనా ముద్దు ఇస్తుంటే బుజ్జి బాబు ఇస్తున్న స్మైల్ కు నెటిజన్లు మొత్తం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాని చుట్టేస్తోంది. ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కంగనా వీర నారి ఝాన్సీ రాణి పాత్రలో కనిపంచబోతోంది.

English summary
Kangana Ranaut kisses her nephew. Photo goes viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu