Don't Miss!
- Finance
Uber Ride: రోడ్డు మీద విమానం ఛార్జీలు.. ముంబైలు ప్రయాణికులకు క్యాబ్ కష్టాలు.. వేల రూపాయలు..
- News
Hyderabad: ప్రేమించిన యువతికి పెళ్లి.. మండపానికి వెళ్లిన ప్రియుడు.. కట్ చేస్తే ఆస్పత్రికి మారిన సీన్..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్పూర్..
- Technology
భారత్లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Sports
IND vs ENG: రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ.. 49 ఏళ్ల తర్వాత అరుదైన ఘనత!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
- Lifestyle
Diabetic UTI :మధుమేహం UTI ప్రమాదాన్ని పెంచుతుంది, ఈ విధంగా సంక్రమణను నివారించవచ్చు..
Dhaakad: కంగనా మార్కెట్ ను దెబ్బకొట్టిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?
బాలీవుడ్ బాక్సాఫీస్ క్వీన్ గా గుర్తింపు అందుకున్న కంగనా రనౌత్ సినిమా అంటే ఒకప్పుడు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ అందుకునేవి. ఇండియన్ సినిమా హిస్టరీల్9 ఎప్పుడూ లేని విధంగా వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి సక్సెస్ రేట్ అందుకున్న ఏకైక హీరోయిన్ కంగనా రనౌత్. ముఖ్యంగా ఆమె నటించిన క్వీన్ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా వందకోట్ల కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా ఇదే కావడం విశేషం.
అయితే గత కొంతకాలంగా కంగనా బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలను చూస్తోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా తీవ్ర స్థాయిలో నిరాశ పరుస్తున్నాయి. ఆమె ఎంతగానో కష్టపడి చేసిన దాఖడ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయ్యింది. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు 95 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కినట్లు బాలీవుడ్ మీడియాలో అయితే అప్పట్లో కథనాలు నిలబడ్డాయి.

అయితే ఈ సినిమాను ఈ ఏడాది మే 20వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయగా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అసలు పెట్టిన పెట్టుబడి ఏ మాత్రం వెనక్కి రాలేదు. కనీసం థియేటర్ ఖర్చులకు కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాలేదు అంటే ఎంత నష్టాలను తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాను ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో కొన్ని షోలను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.
వీకెండ్ లోనే ఈ సినిమాకు కనీసం వేలలో కూడా టికెట్లు అమ్ముడవ్వలేదు. అయితే ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. జీ 5లో జూలై 1 నుంచి ఈ సినిమా సందడి చేయబోతోంది. దారుణమైన ఫలితాన్ని అందుకున్న దాఖడ్ సినిమా కనీసం ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో అయినా మంచి రెస్పాన్స్ అందుకుంటుందో లేదో చూడాలి. అసలైతే కరోనా పరిస్థితులు కారణంగా ఈ సినిమాను నిర్మాతలు ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. అలా రిలీజ్ చేసి ఉంటే తప్పకుండా సేఫ్ అయ్యేవారు. కానీ అత్యాశకు పోయి థియేట్రికల్ గా విడుదల చేసి దారుణమైన నష్టాలను మిగిల్చారు.