ఆ మాఫియా పెద్దలు అలా నాశనం చేస్తారు.. కంగనా షాకింగ్ వాస్తవాలు

టాలీవుడ్ సినిమా దగ్గర కొత్త హీరోయిన్స్ కి కొదవేమి లేదు. ఎంతమంది వచ్చినా మన తలుపులు ఓపన్ చేసే ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ అనేక భాషలు నుంచి వస్తుంటారు. కాగా హిందీ మార్కెట్ నుంచి అయితే తెలుగులో చాలా మంది ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. మరి దర్శకుడు పూరి జగన్నాథ్ పరిచయం చేసిన వాళ్ళు అయితే ఇప్పుడు స్టార్స్ కూడా ఉన్నారని చెప్పాలి.

అలా దర్శకుడు పూరి జగన్నాథ్ తెలుగులో పరిచయం చేసి మళ్ళీ హిందీలో పాగా వేసిన స్టార్ బ్యూటీస్ లో ఇప్పుడు దిశా పటాని అదరగొడుతుంది. కానీ ఈమె కంటే ముందు తెలుగులో పరిచయం అయ్యిన ఓ బ్యూటీ హిందీలో స్టార్ హీరోయిన్ గా ఇంకా పాలిటిక్స్ లో కూడా రాణిస్తుంది. మరి ఆమె ఎవరో కాదు ప్రభాస్ తో ఏ నిరంజన్ లో కనిపించిన నూడుల్స్ జుట్టు అమ్మాయి కంగనా రనౌత్.

kangana ranaut made some shocking comments on bollywood industry

తెలుగులో పెద్దగా కనిపించింది లేదు కానీ హిందీలో మాత్రం బాగానే పాతుకుపోయింది. కొన్నాళ్ల పాటు అక్కడ స్టార్ హీరోస్ తో డేటింగ్ లు కూడా చేసింది అని రూమర్స్ ఉన్నాయి. కానీ ఫైనల్ గా అదే ఇండస్ట్రీ హీరోస్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం బాలీవుడ్ పరిశ్రమపై అక్కడే ఉంటూ అక్కడే సినిమాలు చేస్తూ అక్కడ జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది తరచుగా మాట్లాడుతూ కాంట్రవర్సీల్లో హైలైట్ గానే కొనసాగుతుంది.

మరోసారి కంగనా బాలీవుడ్ ఇండస్ట్రీ పై విరుచుకుపడింది. బాలీవుడ్ లో ఎవరూ ఎవరికీ ఎలాంటి సహాయం అందించరు అని ఇదొక నిస్సహాయ ప్రదేశం అంటూ కామెంట్స్ చేసింది. అలాగే అలాగే అక్కడ పెద్దలు కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎవరైనా తమ టాలెంట్ తో షైన్ అయితే వాళ్ళ కెరీర్ లను ఎలాగైనా నాశనం చేసేయాలని చూస్తుంటారు అని వీటిపై సెపరేట్ గా సోషల్ మీడియాలో పి ఆర్ లాంటి వాళ్ళని పెట్టి మరీ నెగిటివ్ తీసుకొస్తారని ఆరోపించింది.

kangana ranaut made some shocking comments on bollywood industry

అలాగే నాపై కూడా చాలా సార్లు అవాస్తవాలు ప్రచారం చేయించారు అని నేను నా చుట్టూ ఉన్న వారు అందరితో కూడా ప్రేమగా గౌరవం గానే ఉండేదానిని అని అయినా కూడా చాలా మంది నన్ను తప్పు కోణంలో చూసారు. తప్పు నాలో ఉందా వాళ్లలో ఉందా అంటూ ప్రశ్నించింది. కాగా ఇప్పుడు కంగనా నటించిన అవైటెడ్ చిత్రం "ఎమర్జెన్సీ" హిందీలో రిలీజ్ కి రాబోతుండగా ఈ సినిమా కూడా కాంట్రవర్సీగానే మారింది.

ఈ సినిమా రిలీజ్ ఆపాలి అని లేని పక్షంలో కంగనాని చంపేస్తాం అంటూ కూడా బెదిరింపులు వచ్చాయట. ఇలా ప్రస్తుతానికి కంగనా లైఫ్ సినిమాలు రాజకీయాలు వీటిని మించి ఎక్కువగా కాంట్రవర్సీ లతోనే కొనసాగుతుంది అని చెప్పాలి. ఇన్ని తట్టుకొని కూడా కంగనా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండడం అనేది విశేషమే అని చెప్పాలి. కాగా కంగనా నటించిన ఎమర్జెన్సీ చిత్రం ఇందిరా గాంధీ జీవిత చరిత్రపై తెరకెక్కించగా ఈ సెప్టెంబర్ 6న రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X