twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగనా రనౌత్ చీటింగ్ బయటపడింది.. వైరల్ వీడియో, భీభత్సంగా ట్రోలింగ్!

    |

    Recommended Video

    కంగనా రనౌత్ చీటింగ్ బయటపడింది.. వైరల్ వీడియో, భీభత్సంగా ట్రోలింగ్!

    కంగనా రనౌత్ సోలో హీరోయిన్ గా నటించి మణికర్ణిక చిత్రంతో మరో ఘనవిజయం సొంతం చేసుకుంది. జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయి పాత్రలో నటించింది. ఈ చిత్రం కోసం అనేక యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఇక దర్శకుడు క్రిష్ తో చోటు చేసుకున్న వివాదం కూడా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మణికర్ణిక చిత్రానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    మణికర్ణిక ఘనవిజయం

    మణికర్ణిక ఘనవిజయం

    కంగన రనౌత్ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించిన మణికర్ణికా చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కొంత భాగం షూటింగ్ తర్వాత ఈ చిత్రం నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడు. ఆ తర్వాత కంగనారనౌత్ చిత్ర దర్సత్వ భాద్యతలు తీసుకుంది. అనేక వివాదాల నడుమ విడుదలైన మణికర్ణికా చిత్రం విజయం సాధించింది.

    డమ్మీ ఫైట్

    తాజాగా ఈ చిత్ర షూటింగ్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. కంగనా రనౌత్ గుర్రపు స్వారీ చేస్తూ బ్రిటిష్ సైనికులతో పోరాడే సన్నివేశం అది. కానీ కంగనా రనౌత్ స్వారీ చేస్తున్న గుర్రం నిజమైనది కాదు. అది ఒక ఎలక్ట్రిక్ గుర్రం. అది కదులుతూ ఉండగా కెమెరా సాయంతో కంగనా రనౌత్ నిజంగా గుర్రంపై ఉన్న భ్రమ కలిగిస్తారు. ఈ వీడియో బయటకు రాయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

    ట్రోలింగ్ మొదలు

    ట్రోలింగ్ మొదలు

    ఈ వీడియోని నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. కంగనా రనౌత్ ఇదే గుర్రంపై వెళ్లి పాకిస్థాన్ తో యుద్ధం చేస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ఫన్నికర్ణికా అని కామెంట్ పెట్టింది. మరికొంతమంది నెటిజన్లు కంగనాకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ అంటే అలాగే ఉంటుంది. హాలీవుడ్ చిత్రాల్లో సైతం ఇలాంటి టెక్నిక్ లే ఉపయోగిస్తారు. మొత్తంగా సినిమా బావుందా లేదా అనేది మాత్రమే చూడాలి అంటున్నారు.

    క్రిష్‌తో వివాదం

    క్రిష్‌తో వివాదం

    కంగనా రనౌత్ తో వివాదాలు తలెత్తడం వలన దర్శకుడు క్రిష్ మధ్యలో ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. సినిమా విడుదలయ్యాక క్రెడిట్ కోసం ఇద్దరూ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తాను 70 శాతం షూట్ చేశానని క్రిష్ అంటే.. లేదు నేనే 70 శాతం డైరెక్ట్ చేశా.. క్రిష్ చేసింది కేవలం 30 శాతం మాత్రమే అని కంగన తెలిపింది. వీరిద్దరి మధ్య పరస్పర ఆరోపణలు కూడా సాగాయి.

    English summary
    Kangana Ranaut mercilessly trolled for riding mechanical horse in Manikarnika BTS video
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X