రూంలోకి వెళ్లేసరికే సర్ ప్రైజ్.. ఒకే హోటల్‌లో సంజయ్ దత్, కంగన
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ధైర్యం గురించి, ఆమె తెగువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో నెపోటిజాన్ని, మూవీ మాఫియాను ఎండగట్టడంతో కంగన ముందుంటుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తరువాత కంగన చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. బాలీవుడ్, అందులోని సినీ పెద్దలను ఏకిపారేసింది. ఒక్కొక్కరిని దారుణంగా ఏకిపారేసింది. అయితే దీనిపై పలు రకాల కామెంట్స్ వచ్చాయి. కంగన స్వలాభం కోసమే సుశాంత్ సింగ్ కేసును వాడుకుంటోందని కొంతమంది ఆరోపణలు చేశారు. ఈ లాక్డౌన్ సమయంలో కరోనా ఇలా ఎన్నో సవాళ్లను, విమర్శలను ఎదుర్కొంది.

డ్రగ్స్ కేసుపైనా..
బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో.. అందులో భాగంగానే బయటకు వచ్చిన డ్రగ్స్ కేసు సినీ స్టార్స్ పునాదులు కదిల్చాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలోనూ కంగనా సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో జరిగే పార్టీలు, అందులో వాడే డ్రగ్స్ ఇలా అన్నీ తెలుసంటూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రభుత్వంతో ఢీ..
కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటూ నిలబడింది. శివసేనను తన మాటలతో ఏకిపారేసింది. సీఎం ఉద్దవ్ థాక్రేను దారుణంగా విమర్శించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తన కార్యాలయాన్ని కూలగొట్టడంపై కంగనా హైకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వానిదే తప్పని, అందుకు కంగనాకు నష్టపరిహారం చెల్లించాలని ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చింది.

తాజాగా అలా హోటల్‌లో..
తాజాగా కంగనా రనౌత్ సంజయ్ దత్‌ను కలిసింది. ఆ ఇద్దరూ ప్రస్తుతం హైద్రాబాద్‌లోనే ఉన్నారు. పైగా ఒకే హోటల్‌లో ఉన్నారు. ఈ విషయం తనకు తెలియడంతో వెంటనే సంజయ్ దత్‌ను కలవడానికి వెళ్లానని కంగనా చెప్పుకొచ్చింది. తామిద్దరం ఒకే హోటల్‌లో ఉన్నామని తెలిశాక.. సంజు సర్‌ను చూసేందుకు రూంకి వెళ్లాను..ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని వెళ్తే సర్ ప్రైజ్ అయ్యాను.. ఆయన ఇంతకు ముందు కంటే హ్యాండ్సమ్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు.. ఆయన ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.
Recommended Video

అందుకే అక్కడా..
ఇక కంగన కురిపించిన ప్రేమకు సంజయ్ దత్.. ధన్యవాదాలు తెలిపాడు. కంగనా రనౌత్ తలైవీ సినిమా కోసం హైద్రాబాద్‌కు వచ్చింది. కేజీయఫ్ చాఫ్టర్ 2 షూటింగ్ కోసం సంజయ్ దత్ హైద్రాబాద్‌కు చేరుకున్నాడు. ఇలా ఆ ఇద్దరూ కలుసుకున్నారు.


Click it and Unblock the Notifications











