జయలలితకు నేను పూర్తిగా వ్యతిరేకం.. ఫోటో చూసి టైం కావాలని చెప్పా!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతోంది. సినీరాజకీయ ప్రముఖులు, మరే రంగంలో అయినా రాణించిన వారి జీవిత చరిత్రలని వెండి తెరపై ఆవిష్కరించేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తమిళనాట పురుచ్చి తలైవి జయలలిత బయోపిక్ కు మంచి డిమాండ్ నెలకొని ఉంది. జయలలిత జీవిత చిత్రపై సినిమా తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ జయ బయోపిక్ ని భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రకు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ని ఎంచుకోవడం విశేషం.

 తలైవి

తలైవి

దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్‌ని 'తలైవి' అనే పేరుతో తెరకెక్కించబోతున్నారు. తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిందీలో ఈ చిత్రానికి 'జయ' అనే టైటిల్ ఖరారు చేశారు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సంధర్భంగా కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఫోటో చూడగానే

ఫోటో చూడగానే

జయలలిత బయోపిక్‌లో నటించాలని దర్శక నిర్మాతలు నా వద్దకు వచ్చారు. జయలలిత ఫోటో చూడగానే నాకు కాస్త సమయం కావాలని అడిగా. ఈ గ్యాప్‌లో జయలలిత వీడియోలు, పుస్తకాలు చదివా. ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయా అని కంగనా రనౌత్ తెలిపింది. ఈ చిత్రం కోసం తమిళ భాష, భర్త నాట్యం నేరుతుంటున్నట్లు కంగనా రనౌత్ తెలిపింది. అక్టోబర్ లో తలైవి చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

 ఆమెకి పూర్తిగా వ్యతిరేకం

ఆమెకి పూర్తిగా వ్యతిరేకం

జయలలిత స్వభావం తనకు పూర్తిగా వ్యతిరేకమని కంగనా రనౌత్ తెలిపింది. జయలలిత చాలా విధేయతతో ఉండేవారు. నిర్ణయం ఎలాంటిదైనా, ఎంచుకున్న మార్గం ఏదైనా సరే సాధించి చూపించేవారు. దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలని జయ ముందుగా ఆలోచించేవారు కాదు. జయలలిత ఎన్ని వివాదాలు, కష్టాలని ఎదుర్కొన్నారని కంగనా రనౌత్ తెలిపింది. అటు చిత్ర పరిశ్రమలోనూ, దక్షణాది రాజకీయాల్లోనూ జయలలిత చెరగని ముద్ర వేశారు.

దక్షణాది చిత్రాలలో

దక్షణాది చిత్రాలలో

కంగనా రనౌత్ దక్షణాది చిత్రాల్లో నటించడం గురించి మాట్లాడుతూ.. దక్షణాది ప్రేక్షకులు పెద్దగా హిందీ చిత్రాలని చూడరని కంగనా రనౌత్ తెలిపింది. కేవలం చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే హిందీ చిత్రాలు చూస్తారు. నేను సౌత్ ఆడియన్స్‌కి పెద్దగా తెలియదు. సౌత్ లోని ప్రదేశాలని నేను స్వేచ్ఛగా తిరిగి రావచ్చు. ఎవరూ నన్ను గుర్తు పట్టరు అని కంగనా రనౌత్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X