ఈ రోజు మా ఇళ్లు కూలిస్తే.. రేపు మీ ఇంటికి కూడా ఇదే గతి.. కంగన ఫైర్

కంగన రనౌత్ ఆఫీస్‌ను అక్రమ కట్టడంగా భావించిన బృహన్ బొంబాయి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు బుధవారం ఉదయం కూల్చివేతకు సిద్ధం కావడం వివాదంగా మారింది. మనాలి నుంచి కంగన బయలుదేరి ముంబైకి వస్తున్న క్రమంలో ఆమె కార్యాలయాన్ని బుల్‌డోజర్లతో కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేతపై బొంబాయి హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ కార్యక్రమాన్ని అధికారులు ఆపివేశారు. బొంబాయి హైకోర్టు స్టే ఇవ్వడంతోనే శివసేన నేత ఆదిత్య థాక్రే మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంపై సుదీర్ఘంగా ఆయన చర్చించారు. ఈ క్రమంలో కంగన రనౌత్ మహారాష్ట్ర సర్కార్‌పై ఘాటుగా స్పందించారు.

ఇదిలా ఉండగా, తన కార్యాలయాన్ని కూల్చివేయడంపై తీవ్రంగా కంగన స్పందించారు. ఈ రోజు నా ఇంటిని కూల్చివేశారు. రేపు ఇదే గతి మీకు పట్టవచ్చు. ప్రభుత్వాలు ఈ రోజు ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు అంటూ మహారాష్ట్ర సర్కార్‌పై కంగన రనౌత్ మండిపడ్డారు.

 Kangana Ranaut on Maharastra: Today demolished my house, tomorrow it will be yours

కంగన రనౌత్ ఇంటిని కూల్చివేయడంపై శరద్ పవార్ స్పందించారు. ఆమె ఇంటి గురించి పూర్తి సమాచారం నాకు తెలియదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు పేపర్లో తెలుసుకొన్నాను. ముంబైలో అక్రమ కట్టడాలు సర్వసాధారణం. అయితే నిబంధనలకు అనుగుణంగా బీఎంసీ వ్యవహరిస్తే అది సరైనదే అంటూ శరద్ పవర్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X