నా తమ్ముడికే సాయం చేయలేదు.. అలా అడిగితే సముద్రంలో ముంచేస్తా.. కంగనా!
వివాదాల రాణి కంగనా రనౌత్ బాలీవుడ్ లో వారసత్వంపై మరోమారు స్పందించింది. బాలీవుడ్ లో కంగనా తరచుగా వివాదాల్లో నిలుస్తుండడం చూస్తూనే ఉన్నాము. మొన్న విడుదలైన మణికర్ణిక చిత్రం వరకు కంగనా రనౌత్ చుట్టూ అన్నీ వివాదాలే. ఎలాంటి విషయం గురించి అయినా కంగనా మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. వివాదాలు వెంటాడుతున్నా నటిగా కంగనా దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో వారసత్వంపై తన అభిప్రాయాలని వెల్లడించింది.

బలంగా వాదన
బాలీవుడ్ లో కంగనా రనౌత్ ఓ ఫైర్ బ్రాండ్. అనేక విషయాల గురించి కంగనా రనౌత్ చాలా రోజులుగా తన వాదనని బలంగా వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న హీరోయిన్లపై లైంగిక వేధింపులు, వారసత్వంతో అర్హత లేని వాళ్ళు కూడా నటులుగా మారిపోతుండడంపై కంగనా రనౌత్ గట్టిగా మాట్లాడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ వారసత్వం గురించి తన వైఖరి వెల్లడించింది.

50 శాతం మాత్రమే అవకాశం
ఒక వేళ మీ పిల్లలు చిత్ర పరిశ్రమలోకి రావాలని భావించి మీ సాయం కోరితే చేస్తారా అనే ప్రశ్నకు కంగనా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నేను వారసత్వంగా నా పిల్లలకు సాయం చేస్తే వారు మంచి దర్శకులుగా, మంచి నటులుగా ఎదిగేందుకు 50 శాతం మాత్రమే అవకాశం ఉంది. కానీ ఓ తల్లిగా వారిని సరైన పద్దతిలో పెంచితే అన్ని నైపుణ్యాలు అలవాడుతాయి. అప్పుడు కేవలం చిత్రం పరిశ్రమలోనే కాదు ఏ రంగంలో అయినా వాళ్ళు ఉన్నతస్థాయికి చేరుకోగలరు అని కంగన తెలిపింది.

సముద్రంలో ముంచేస్తా
దీనికి కొనసాగింపుగా కంగనా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది. నా పిల్లలని సముద్రంలో అయినా ముంచేస్తాను కానీ.. వారసత్వంగా మాత్రం వారికి సాయం చేయను. కఠిన పరిస్థితులు ఎదుర్కొనగలిగే వాళ్లే గొప్పవాళ్ళు అవుతారు. వారసత్వంతో గొప్పవారు కావాలనుకోవడం అడ్డదారిలో వెళ్లడమే అని కంగనా రనౌత్ తెలిపింది.

నా సోదరుడికే సాయం చేయలేదు
తాను ఇంతవరకు నా సోదరుడికే సాయం చేయలేదు అని కంగనా అంటోంది. మా తమ్ముడు గత నాలుగేళ్లుగా పైలెట్ కావాలని కష్టపడుతున్నాడు. అతడికి నేను ఎలాంటి సాయం చేయలేదు. నేను తలచుకుంటే నా తమ్ముడికి మంచి ఉద్యోగం ఇప్పించగలను. కానీ ఆ పని చేయను. అతడే సొంతగా ఎదగాలి. ఎదుగుతాడనే నమ్మకం తనకు ఉందని కంగన తెలిపింది.


Click it and Unblock the Notifications











