లోదుస్తులు లేకుండా ఫోటో షూట్.. పారిపోవాలనిపించింది, పోకిరి సినిమా అలా మిస్సయ్యా!
వివాదాల రాణి కంగనా రనౌత్ మరో సంచలన విషయాన్ని బయట పెట్టింది. బాలీవుడ్ లో కంగనా తరచుగా వివాదాల్లో నిలుస్తుండడం చూస్తూనే ఉన్నాము. మొన్న విడుదలైన మణికర్ణిక చిత్రం వరకు కంగనా రనౌత్ చుట్టూ అన్నీ వివాదాలే. ఎలాంటి విషయం గురించి అయినా కంగనా మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. వివాదాలు వెంటాడుతున్నా నటిగా కంగనా దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా తన కెరీర్ ఆరంభంలో జరిగిన సంగతుల గురించి వివరించింది.

కెరీర్ ఆరంభంలో
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్లకు ఇబ్బందులు తప్పవు. ఆడిషన్స్ లో దర్శకులని, నిర్మాతలని మెప్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అవకాశాలు ఇస్తారు. ఆడిషన్స్ పేరుతో వర్థమాన నటీమణులు లైంగికంగా వేధిస్తున్నారు అంటూ గతంలో కాస్టింగ్ కౌచ్, మీటూ అంశాలపై ఉద్యామాలు జరిగిన సంగతి తెలిసిందే. కనగానా రనౌత్ మాట్లాడుతూ తాను తొలి చిత్రం కోసం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నానో వివరించింది.

లోదుస్తులు లేకుండా
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహ్లానీ తాను నిర్మించే 'ఐ లవ్యూ బాస్' అనే చిత్రానికి ఫోటో షూట్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో తనకు అవకాశం ఇస్తానని, ఫోటో షూట్ కోసం రావాలని కోరారు. ఫోటో షూట్ లో ఎలాంటి లోదుస్తులు లేకుండా పైనుంచి కిందివరకు ఉండే పలచటి వస్త్రాన్ని ధరించాలి. ఆ వస్త్రంతోనే ఫోటో షూట్ చేశారు. అది ఒకరకంగా శృంగార భరిత చిత్రం. వాళ్ళు చెబుతున్న విధంగా ఫోటో షూట్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డా. నేను హీరోయిన్ గా నటిస్తానంటే నా తల్లిదండ్రులు ఎంతగా భయపడ్డారో, ఆ భయం నాకు ఫోటో షూట్ చేస్తున్నప్పుడు అనిపించింది.

పారిపోవాలనుకున్నా
ఫోటో షూట్ మధ్యలో వదిలేసి పారిపోవాలనిపించింది. కానీ భరిస్తూ ఫోటో షూట్ ముగించా. ఈ చిత్రంలో నటించడం నా వల్లకాదని డిసైడ్ అయ్యాక నా ఫోన్ నెంబర్ మార్చేసి వాళ్లకు కనిపించకుండా వెళ్ళిపోయా అని కంగనా రనౌత్ తెలిపింది. ఆ తర్వాత తాను 2006లో గ్యాంగ్ స్టర్ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు కంగనా వివరించింది.

అలా పోకిరి మిస్సయ్యా
2006లో గ్యాంగ్ స్టర్ చిత్ర యూనిట్ ఆడిషన్స్ నిర్వహించింది. అదే సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోకిరి చిత్రానికి మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. రెండు ఆడిషన్స్ లో పాల్గొన్నా. రెండింటిలో నేనే సెలెక్ట్ అయ్యా. కానీ ఆ సమయంలో గ్యాంగ్ స్టర్ చిత్రంలో నటించడానికే మొగ్గు చూపి పోకిరి చిత్రాన్ని వదులుకున్నా. పోకిరి చిత్రం టాలీవుడ్ లో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ చిత్రంలో నటించానని కంగనా తెలిపింది.


Click it and Unblock the Notifications











